రామ్ చరణ్ పై ఇంత చెత్త రుమరా..? గ్లోబల్ ఇమేజ్ ని గబ్బు పట్టిస్తున్నారుగా..!

రామ్ చరణ్ ..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విప్పరీతంగా మారుమ్రోగిపోతున్న పేరు . ఆయన మంచి చేసిన చెడు చేసిన జనాలు చెడుగానే భావిస్తున్నారు . మరీ ముఖ్యంగా మెగా హెటర్స్ ఏ రేంజ్ లో రామ్ చరణ్ పై పగలు పెంచేసుకున్నారో.. ఆయనపై జరిగే ట్రోలింగ్ చూస్తూ ఉంటేనే అర్థం అయిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకున్నారు . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ ఫైకి తీసుకురాబోతున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా ఇంచుమించు వెంకటేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జయం మనదేరా సినిమా టైప్ లోనే ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . గేమ్ చేంజర్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్లో చరణ్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట .అంతేకాదు అభ్యుదయ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తిగా మనం రాంచరణ్ చూడబోతున్నామట. అదే మూమెంట్లో వెనుకబడిన కులం వాళ్లని ఎంకరేజ్ చేస్తూ ఉంటే విలన్ గ్యాంగ్ రామ్ చరణ్ ని కిరాతకంగా నరికేస్తుందట .

ఈ సీన్స్ మనం తెరపై చూస్తే ఖచ్చితంగా మనకి జయం మనదేరాలో వెంకటేష్ ఫ్లాష్ ప్యాక్ ఎపిసోడ్ సీన్స్ గుర్తొస్తాయని ఓ న్యూస్ వైరల్ గా మారింది . అయితే రామ్ చరణ్ లాంటి హీరో గతంలో ఆల్రెడీ హిట్ అయిన సినిమా ఫ్లాష్ ప్యాక్ ను తన సినిమాలో ఎలా పెట్టుకుంటారు..? ఇది నిజంగా ఒక చెత్త రుమరే అంటూ మెగా ఫాన్స్ కొట్టి పడేస్తున్నారు.. కొందరు కావాలని రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ ని గబ్బు పట్టిస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు..!!