ఇక నోర్లు మూయండ్రా.. తారక్ కెమారా మ్యాన్ ని అరిచింది అందుకే..క్లారిటీ వచ్చిందిగా..!

రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ లో భాగమయ్యారు . తాజాగా మరోసారి ముంబైకి వెళ్ళాడు ఎన్టీఆర్. అప్పుడు ఎయిర్పోర్ట్లో ఆయన వెళ్తున్న పిక్చర్స్ కూడా వైరల్ అయ్యాయి.

కాగా వార్ 2 సెట్స్ నుంచి ముంబైలోని హోటల్ కి వెళుతూ ఉండగా వెనక కెమెరామెన్ పడతారు . ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా మరిచిపోయి కొందరు కెమెరామెన్లు ఆయన వెనుక వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తారు. దీంతో అది గమనించిన తారక్ “ఏయ్ కీప్ ఇట్ బ్యాక్ ” అంటూ గట్టిగా అరుస్తాడు. దీంతో ఆ వీడియోని బాగా ట్రెండ్ చేశారు జనాలు. కొంతమంది ట్రోల్ కూడా చేశారు . ఎన్టీఆర్ కి ఇంత కోపం ఎక్కువ..? అస్సలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు .. అని కొంతమంది అంత హెడ్ వెయిట్.. తల పొగరా అంటూ మరి కొంతమంది దారుణంగా ట్రోల్ చేశారు .

నిజానికి తారక్ ఎక్కడ తన లుక్ లీక్ అయిపోతుంది అన్న భయంతో అరవలేదు. తారక్ ఫోన్లో పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. తన ప్రైవసీకి భంగం కలిగించకూడదు అన్న విషయాన్ని మర్చిపోయిన కెమెరామెన్ ఆయన ఫోన్లో మాట్లాడుతున్న కూడా రికార్డ్ చేశారు . ఆ కారణంగానే ఆయనకు కోపం వచ్చి అరిచారు . ఎవరికైనా సరే మన పర్సనల్ మాట్లాడుతున్నప్పుడు ఇలా రికార్డ్స్ చేస్తే కోపం .. ఎంత స్టార్ సెలబ్రిటీ అయినా సరే దాని అర్థం చేసుకోకుండా కొంతమంది కావాలనే తారక్ ని ట్రోల్ చేస్తూ ఉండడం నందమూరి అభిమానులకు నచ్చడం లేదు. ఫైనల్లీ తారక్ చేసిన దాంతో తప్పులేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ట్రోల్ చేసే వాళ్ళని ఇక నోరు మూయండిరా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!