ఓరి దేవుడోయ్.. ఇదెక్కడి పిచ్చి నిర్ణయం.. రామ్ చరణ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు ఏంట్రా బాబు..!

రామ్ చరణ్ .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో .. మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన .. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మెగా పవర్ స్టార్ ట్యాగ్ నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చేలా కష్టపడ్డాడు. ప్రెసెంట్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు . ఈ సినిమా కోసం తన ఫుల్ మేకోవ్ ని మార్చేయబోతున్నాడు . ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లబోతుందట . దాదాపు రెండు నెలల పైనే గ్యాప్ తీసుకోబోతున్నారట . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ కూడా నటించబోతుంది . రెండవ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ని చూస్ చేసుకున్నారట . అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలి అంటూ ఫిక్స్ అయ్యాడట బుచ్చిబాబు. అదే విధంగా రామ్ చరణ్ కూడా ఆయన నిర్ణయాన్ని ఓకే చెప్పారట . వచ్చే సమ్మర్ అంటే దాదాపు సంవత్సరం ఉంది .

ఇప్పటికి ఇంకా సమ్మర్ మనకు పోలేదు . ఈ సినిమా కోసం వన్ ఇయర్ టైం కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అభిమానులు. అంతేకాదు ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయితే మరి సుకుమార్తో సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడు ..? ఆ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది..? అంటూ డీలా పడిపోయారు మెగా ఫాన్స్ . బుచ్చిబాబు సనా ఓకే.. ఆయన కమిట్మెంట్లు ఆయన తీసుకుంటూ ఉంటారు . గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఆమాత్రం అర్థం చేసుకోకుండా సినిమాను వన్ ఇయర్ తర్వాత రిలీజ్ చేస్తాడా..? ఇది నిజంగా పిచ్చి డెసిషన్ అంటూ మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు..!