మోదీ-షా త‌దుప‌రి ల‌క్ష్యం కేసీఆరేనా?

`నెక్ట్స్ ఏంటి?` ఇప్పుడు ఇదే ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతోంది. కాషాయ ద‌ళం ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని.. త‌మ త‌దుప‌రి ల‌క్ష్యంగా చేసుకుంటోంది? ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత‌.. ఆ పార్టీ అధ్య‌క్షుడు ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు? అని అన్ని రాష్ట్రాల నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు! అయితే త‌దుప‌రి ల‌క్ష్యాన్ని కూడా బీజేపీ సెట్ చేసుకుంద‌ట‌. ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డేందుకు వీలుగా ఉన్న తెలంగాణ‌ను ఇప్పుడు త‌మ టార్గెట్‌గా ఎంచుకుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల‌కు అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన […]

యూపీలో గెలుపెవ‌రిది?  బెట్టింగుల జోరు!

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం ఐదు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మ‌ట్ట‌మ‌వుతుంది? ప్ర‌ధాని మోడీ హ‌వా ఏ మేర‌కు ప‌నిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వ‌ంటి విష‌యాల‌పై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్ల‌లో సాగుతుండ‌డంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే ప‌డింది. […]

పన్నీర్ సీఎం అయితే బీజేపీదే అధికారమా?

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఆధిప‌త్యం కోసం ప‌రిత‌పిస్తున్న బీజేపీకి త‌మిళ‌నాడు ద్వారా ఆ అవ‌కాశం దక్కిందా?  ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నెలకొన్న సంక్షోభంలో జోక్యం చేసుకోబోమ‌ని కేంద్రం పైకి చెబుతున్నా.. రిమోట్ కంట్రోల్ మాత్రం త‌న ద‌గ్గ‌రే ఉంచుకోబోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర రావు ద్వారా పావులు న‌డిపిస్తోంది కేంద్ర నాయక‌త్వం! అమ్మ‌కు న‌మ్మిన బంటు అయిన ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు ఇచ్చి తెర వెనుక చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి హ‌స్తిన ఆధిప‌త్యాన్నిత‌మిళులు […]

బ్రేకింగ్: టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది! రాష్ట్రం విడిపోయాక తీవ్రంగా న‌ష్ట‌పోయింది టీడీపీనే! అలాగే ఇప్ప‌టికే మినీ తెలుగుదేశంలా టీఆర్ఎస్ మారిపోయిందనేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఓటుకు నోటు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన ద‌గ్గ‌ర నుంచి టీఆర్ఎస్‌-టీడీపీ మ‌ధ్య‌ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌లా ప‌రిస్థితి మారిపోయింది, మ‌రి ఉప్పు నిప్పు లాంటి పార్టీలు రెండూ క‌లిసి ప‌నిచేస్తాయని క‌ల‌లో కూడా ఊహించ‌లేం క‌దా!  కానీ ఇప్పుడు ఇలాంటి ప‌రిణామాలు రాబోతున్నాయ‌ట‌! వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ – టీడీపీతో బీజేపీ […]

పెటాకుల దిశగా టీడీపీ-బీజేపీ పొత్తు

మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీతో ఎప్పుడెప్పుడు విడిపోదామా? అని బీజేపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు! క‌ల‌హాల కాపురం చేయ‌లేమ‌ని చెబుతున్నా.. త‌ప్ప‌దు అన్న రీతిలో అధినాయక‌త్వం ఆదేశాలివ్వ‌డంతో ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కూట‌మిలో కొన‌సాగుతున్నారు! అయితే పెండింగ్‌లో ఉన్న‌ మున్సిప‌ల్‌-కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విడివిడిగా పోటీచేయ‌నున్నాయా? ఇక టీడీపీ-బీజేపీ నేత‌లు ఎవ‌రి దారి వారు చూసుకోబోతున్నారా? క‌ల‌హాల కాపురానికి ఈ ఎన్నిక‌ల‌తో ఫుల్ స్టాప్ పెట్టి బ‌రిలోకి దిగ‌బోతున్నారా? అంటే అవున‌నే సమాధాన‌మే వినిపిస్తోంది! రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ […]

టీడీపీతోనే కయ్యానికి కాలుదువుతున్న బీజేపీ !

`తెలుగుదేశం పాల‌న‌లో అవినీతి తార‌స్థాయికి చేరింది..` ఇది నిత్యం ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌! దీనిని ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌దే లేదు. కానీ ఇదే విమ‌ర్శ మిత్ర‌ప‌క్ష ఎమ్మెల్యే చేస్తే అది నిజంగా ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే అంశ‌మే!! అలా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించారు ఏపీ బీజేపీ ప‌క్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు! ఇప్పుడు ఆయ‌న  టీడీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి భాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు […]

బీజేపీ లెక్క‌: హోదా కోసం ఫైటింగ్ వేస్ట్‌

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగిందా? నిజానికి హోదా విష‌యంలో ఏపీకి అర్హ‌త లేదా? విభ‌జ‌న‌తో ఎంతో న‌ష్ట‌పోయిన ఏపీకి అర్హ‌త లేదుకాబ‌ట్టే.. ఇంత‌కాలం హోదా ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెబుతోందా? అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు హోదా బ‌దులు ప్యాకేజీతో స‌రిపెడ‌తామ‌ని అంటోందా? అంటే.. ఏపీ బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా సోము హోదాపై స్పందించారు. ఆయ‌న ఎప్పుడు మాట్లాడినా.. ఎదుటివాళ్లు ఏమ‌నుకుంటారు? అని […]

హోదా పోరాటాన్ని తొక్కేస్తున్న‌ టీడీపీ, బీజేపీ

హోదా ఇచ్చే వ‌ర‌కూ పోరాడ‌దామ‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇప్పుడు హోదాతో ఒరిగేది ఏమీ లేదు ప్యాకేజీతోనే లాభ‌మ‌ని ఫిరాయించారు!! హోదా ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ఇవ్వాలి అని పోరాడిన వెంక‌య్య‌.. ఇప్పుడు ప్యాకేజీనే మంచిదంటూ నీతులు వ‌ల్లెవేస్తున్నారు!! హోదా అని ప్యాకేజీ ఇచ్చారేంటి? అని ప్ర‌శ్నించేందుకు బాబు సిద్ధంగా లేరు! టీడీపీ ఎంపీలు, బీజేపీ నాయ‌కులు ఏపీ ప్ర‌జ‌ల‌కు పెట్టిన శ‌ఠ‌గోపం గురించి మాట్లాడేందుకు నోరు మెద‌ప‌డం లేదు! హోదా కోసం జరిగే పోరాటం పుంజుకుంటే […]

ప్యాకేజీ బండారం బ‌య‌ట ప‌డుతోంది!

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఎదురు చూస్తున్న త‌రుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్ర‌బాబు స‌హా ఆయ‌న మందీ మార్చ‌లం పెద్ద ఎత్తున ప్ర‌వ‌చ‌నాలు వ‌ల్లించారు. తీరా ప్యాకేజీ వ‌చ్చి ఆరు మాసాలు గ‌డిచిపోయింది. ఇప్ప‌టికీ ఎలాంటి హామీ కార్య‌రూపం దాల్చ‌లేదు. స‌రిక‌దా ప్యాకేజీకి చ‌ట్ట బ‌ద్ధ‌త హుష్ కాకి అన్న‌చందంగానే మారిపోయింది. ఈ విష‌యంలో గ‌డుసుగా మాట్లాడిన బీజేపీ నేత‌.. ఆర్థిక మంత్రి […]