వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!

నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]

టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజాగా మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ తీవ్రస్థాయి నిర్ణయాలకు రెడీ అవుతున్నారు. ఈ […]

రాజకీయ నాయకులూ ప్రేమలో పడతారు..

ప్రేమకు హోదా..దర్పం ఇంకా..ఏమైనా ఉంటాయా ? ఉండవు..తొలి చూపులోనే ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇలాగే మోడీ కేబినెట్ లోని మంత్రి ప్రేమలో పడిపోయారు. ఎయిర్ హోస్టెస్ రచన శర్మ చూపుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో పడిపోయారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆగస్టు 9వ తేదీన వీరి వివాహం జరగబోతోందని తెలుస్తోంది. అసలు వీరి ప్రేమ ఎలా చిగురించింది అనే దానిపై మంత్రి సుప్రీయో వివరణనిచ్చారు. […]