ఏపిలో పార్టీని శరవేగంగా విస్తరించేందుకు బిజెపి తన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది.ఆరుగంటల పాటు ఢిల్లీలోని ఏపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నివాసంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేశారు. ”రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వస్తామన్న వద్దనకండి. చేర్చుకోండి. చివరికి టిడిపి వాళ్లనైనా వదలవద్దు. పార్టీ తలుపులు బార్లా తెరవండి. బిజెపిని బలోపేతం చేయ్యండి” అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు. శుక్రవారం నాడిక్కడి […]
Tag: bjp
అంతకంతకు పెరుగుతున్న అంతరం
అధికారం పంచుకుంటున్న మిత్రపక్షాలు ధ్వంధ్వ విధానాలను అనుసరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికార తెలుగుదేశంపార్టీకి నిజమైన మిత్రపక్షమా? లేక అంశాలవారీగా మద్దతుఇస్తున్న విపక్షమా అన్న సందేహాలు కలిగిస్తోంది. పైకి అంశాలవారీగా కొన్నిసార్లు ప్రతిపక్షంగాను లోన మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మిత్రపక్షంగాను భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాంతో అంశాలవారీగా సందర్భానికి తగ్గట్లుగా ఒక్కో విధంగా వ్యవహరిస్తున్న కమలనాధుల తీరుతో ఇటు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అయోమయం నెలకొంటోంది. ఇందుకు […]
దేవుడి జోలికెళ్లారు:అనుభవిస్తారు
అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు… ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. విజయవాడలో ఇటీవలి కాలంలో శరపరంపరగా జరుగుతున్న ఆలయాలను కూల్చివేస్తూ తెదేపా సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుంటే, భాగస్వామ్య పక్షంగా కనీసం అడ్డుకోలేని దుస్థితి తమ నాయకత్వంలో కనిపిస్తోందని బిజెపి శ్రేణులు […]
స్విస్ ఛాలెంజ్: కేంద్రానికి ఇష్టంలేదా?
అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]
కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!
ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే […]
నీటి యుద్దాలు — కేంద్రం దొంగాట
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]
స్వామి ‘రామాయణం’లో నిజమెంత?
సుబ్రహ్మణ్యస్వామి అంటే దేశ రాజకీయాల్లో సంచలనం. బిజెపి నాయకుడిగా, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఎందరో రాజకీయ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన ఘనుడు. జయలలితను జైలుకు పంపడమే కాకుండా, సోనియాగాంధీతోపాటు ఆమె తనయుడు రాహుల్‌గాంధీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాడీయన. ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ రెండోసారి ఆ బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుపుల్ల వేసింది కూడా ఈ స్వామే. ఈయనగారికి రామయణం గురించి వివాదం సృష్టించాలనిపించినట్లుంది. రామాయణంలో రాముడు, రావణుడి కాళ్ళు నరికేశాడు, మళ్ళీ వాటిని రప్పించాడు. ఎందుకు? అంటూ […]
చంద్రులను టెన్షన్ పెడుతున్న జంప్ జిలానీలు
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు […]
KTR ని ఎత్తి ఇరుక్కుపోయిన పారికర్
బీజేపీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించడంపై తెలంగాణ బీజేపీ నేతల్లోనే చర్చనీయాంశమయిందని అంటున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం సాధారణమే. అలాగే, ఆ తర్వాత పార్టీ సమావేశాల్లో.. ప్రత్యర్థి ప్రభుత్వం పైన విమర్శలు కూడా సహజమే. మనోహర్ పారికర్ కూడా అధికారిక సమావేశంలో […]
