చంద్ర‌బాబు రాజీ చేసినా తీరు మారని నాయకులు … తక్షణం కర్తవ్యం?

ఏపీలో అధికార టీడీపీకి నాయ‌కుల మ‌ధ్య గొడ‌వ‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప‌దేళ్ల త‌ర్వాత పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌న్న‌మాటే గాని చంద్ర‌బాబుకు నాయ‌కుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ర్దుబాటుతోనే స‌గం కాలం గ‌డిచిపోతోంది. టీడీపీ వ‌ర్సెస్ టీడీపీ నాయ‌కుల‌తో పాటు టీడీపీ వ‌ర్సెస్ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం బీజేపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచి చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతోన్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావుతో పాటు జిల్లా ప‌రిష‌త్ […]

టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ గాలం..!

యూపీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం త‌ర్వాత బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆప‌ర‌ష‌న్ తెలంగాణ మీదే ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవ‌డం లేదా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీఆర్ఎస్‌కు ధీటుగా ఉండేలా అమిత్ ప్లాన్లు వేస్తున్నార‌ట‌. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2019 ఎన్నిక‌ల నాటికి బీజేపీ ఫ‌స్ట్ ప్ర‌యారిటీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డంతో పాటు అక్క‌డ నుంచి వీలున్న‌న్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవ‌డం. […]

రుణ‌`మాఫీ`తో ఇద్ద‌రు చంద్రుల‌కు చెక్‌

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయ‌డానికి బీజేపీ అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ఆ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వం రైతుల‌కు `రుణ‌మాఫీ` చేస్తుంద‌ని, ఆభారం కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని చేసిన‌ కేంద్ర‌మంత్రి ప‌క‌ట‌నతో.. ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణ‌మాఫీ నే ప్ర‌చారంగా చేసుకుని అటు చంద్ర‌బాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నిక‌ల్లో ఉప‌యోగించే దిశ‌గా కేంద్రం అడుగులేస్తోంది. […]

2019 వార్‌: ఏపీ-తెలంగాణ‌లో రాజకీయాలను శాసిస్తున్న కులాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డి అప్పుడే మూడేళ్లు గ‌డిచిపోయింది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ధ్య‌లో జ‌రిగే చిన్నా చిత‌కా ఎల‌క్ష‌న్ల‌తో పాటు 2019 ఎన్నిక‌ల‌పైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణ‌లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మ‌ధ్య ప్ర‌ధానంగా పోరు ఉంటుంది ? అస‌లు ఎవ‌రి బ‌లం ఎంత‌? ఎవ‌రి బ‌ల‌గం ఎంత‌? ఒంట‌రిగా బ‌రిలో నిలిచి ఒకే పార్టీ అధికారం ద‌క్కించుకునే అవ‌కాశం ఉందా ? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు […]

ఏపీ బీజేపీ నేత‌ల దూకుడుకు బాబు క‌ళ్లెం

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. ఏపీ రాజ‌కీయ చిత్రంలో అనేక మార్పులు జ‌రిగే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎవ‌రు ఎవ‌రికి మిత్రులు అవుతారో.. మరెవ‌రు శ‌త్రువుల‌వుతారో కొద్ది రోజుల్లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విష‌యంలో టీడీపీ నాయ‌కులు, టీడీపీతో వ్య‌వ‌హ‌రించే విష‌యంలో బీజేపీ నాయ‌కుల్లోనూ కొంత మార్పు వ‌చ్చిన‌ట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్త‌రించాల‌ని బీజేపీ నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. విస్త‌ర‌ణ‌కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని పార్టీ పెద్ద‌ల‌కు చెబుతున్నారు. ఇదే […]

చిదంబ‌రం ఏంటి.. బీజేపీలో చేర‌డ‌మేంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా!!

త‌మిళ‌నాడుపై ప‌ట్టు సాధించాల‌నే ఆశ బీజేపీలో ఇంకా క‌నిపిస్తూనే ఉంది. మాజీ సీఎం దివంగ‌త జ‌య‌ల‌లిత‌ మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆమె విధేయుడైన ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు ఇచ్చి ఎన్నో ఆటలు ఆడించింది. ఆయన్ను ముందుంచి వెనుక నుంచి చ‌క్రం తిప్పుదామ‌ని క‌ల‌లుగంది. చివ‌ర‌కు సీఎం పీఠం ఎక్కుదామ‌ని భంగ‌ప‌డిన శ‌శికళ వ‌ర్గానికే సీఎం కుర్చీ ద‌క్కింది. దీంతో ఎలాగైనా ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల‌న్న ఆశ ఆవిరైంది. అయితే ఇప్పుడు చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియ‌ర్ […]

రోజాకు ఏమైనా ప్రత్యేక రూల్స్.. చట్టాలు ఉన్నాయా?

కొత్త అసెంబ్లీలోనూ అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత‌, బోండా ఉమామ‌హేశ్వ‌రావు.. మ‌ధ్య గ‌త అసెంబ్లీ సమావేశాల్లో జ‌రిగిన గొడ‌వ‌పై విచార‌ణ కొలిక్కి వ‌చ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించ‌డం, త‌ర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఇవ‌న్నీ పెద్ద దుమార‌మే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అన‌డంపై బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు […]

ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్

ఒక్క విజ‌యం ఎంతోమందికి స‌మాధానం చెబుతోంది. ఒక్క విజ‌యం ఎన్నో సందేహాలకు కార‌ణ‌మ‌వుతోంది. ఒక్క విజ‌యం.. నాయ‌కుడిని శ‌క్తిగా నిలిపింది!! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన బీజేపీ నాయ‌కులు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇప్పుడు ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నారు. ఈ విజ‌యం సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ఏపీలో ప‌రిస్థితులు మాత్రం త‌ల‌కిందుల‌య్యాయి! 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన హామీల‌ను ప్ర‌ధాని తుంగ‌లో తొక్కారు! ద‌క్షిణాదిలో ఏపీపై ప‌ట్టు సాధించాల‌ని.. రాష్ట్రానికి […]

యూపీ ఎఫెక్ట్‌: తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు

యూపీ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల‌పై ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ ఇప్పుడు దేశమంతా మొద‌లైంది. ప్ర‌ధాని మోదీని ఢీ కొట్ట‌డం ఇక అసాధ్య‌మ‌న్న విష‌యం ఈ ఫ‌లితాల‌తో తేలిపోయింది. అందుకే ఇప్ప‌టినుంచే త‌మ వ్యూహాలు మార్చుకోవ‌డానికి సిద్ధ‌మవుతున్నారు నాయ‌కులు. ముఖ్యంగా దూర‌దృష్టిగ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఇప్పుడు యూపీ ప్ర‌భావం ప‌డింది. అందుకే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మోదీ హవా.. తెలంగాణ రాష్ట్రంపై ప‌డ‌కుండా ఉండేందుకు ప‌క్కా వ్యూహంతో దూసుకుపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహానికి […]