పెద్ద‌ల ఆశ‌ల‌కు బీజేపీ నేత‌ల‌ గండి

తెలంగాణ బీజేపీలో లుక‌లుక‌లు బ‌య‌టప‌డ్డాయి. ఆధిప‌త్య పోరు ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని ప‌రుగు పెట్టించాల్సిన ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య అభిప్రాయ‌బేధాలు పార్టీ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ల‌క్ష్మ‌ణ్‌, శాస‌నాస‌భా ప‌క్ష నేత కిష‌న్ రెడ్డి కేంద్రాలుగా రెండు ప‌వ‌ర్ హౌస్‌లు ఏర్ప‌డుతు న్నాయ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని అధిష్ఠాన పెద్ద‌లు ఆశ‌లు పెట్టుకుంటే.. వీరు ఆ ఆశ‌ల‌కు […]

బీజేపీ ఆప‌రేష‌న్ ” రెడ్డి ” స్టార్ట్‌

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ దూకుడుకు ప‌గ్గాలు వేసేందుకు బీజేపీ అదిరిపోయే స్కెచ్‌తో ఉందా ? 2019లో బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం లేదా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌తో ఉందా ? ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌క్కా వ్యూహం ప‌న్నుతున్నారా ? అంటే తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల ఇన్న‌ర్ క‌థ‌నాల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. తెలంగాణ‌లో సాధారణ ఎన్నికలు రెండేళ్లుండగానే పార్టీల్లో కదలిక మొదలైంది. ఉన్న నాయకత్వానికి.. కొత్త నాయకత్వాన్ని జత […]

అద్వానీని రాష్ట్ర‌ప‌తి రేసు నుంచి త‌ప్పించారా..! అస‌లు క‌థ ఇదే..!

భార‌త రాష్ట్ర‌ప‌తి రేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఉన్నార‌ని గ‌త కొద్ది రోజులుగా మీడియాలో ర‌క‌ర‌కాలుగా వార్తలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. పార్టీలో మోస్ట్‌ సీనియర్‌ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్‌ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చార‌ని నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. కొద్ది రోజులుగా ఈ ప‌ద‌వికి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, […]

విజ‌య‌వాడ ఎంపీ సీటుపై పురందేశ్వ‌రి క‌న్ను..!

ఎన్టీఆర్ కూతురిగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి ముందుగా ఎన్టీఆర్ కుమార్తెగా రాజ‌కీయాల్లో పునాది వేసుకున్నా త‌ర్వాత ఆమె ఛ‌రిష్మాతో పాటు సొంత టాలెంట్‌తో దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది రాజ‌కీయ దిగ్గ‌జాల‌తో శ‌భాష్ అనిపించుకున్నారు. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో సోనియాగాంధీ ద‌గ్గ‌ర ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పిన పురందేశ్వ‌రి కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఏపీలో కాంగ్రెస్ ప‌నైపోవ‌డంతో ఆమెతో పాటు ఆమె భ‌ర్త ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ […]

బీజేపీ బాహుబ‌లి అత‌డా? ఆమెనా?

ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ సిద్ధ‌మైంది. పార్టీ కొన్ని చోట్ల బ‌లంగా ఉన్నా.. శ్రేణుల‌న్నింటినీ ఏకం చేసి ఎవ‌రు న‌డిపిస్తార‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రానికి సంబంధించి అప్పుడప్పుడూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నా.. వీరెవ‌రూ కాద‌ని ఒక ఫేమ‌స్ ఫేస్ కోసం ఇప్పుడు ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా ఇద్ద‌రి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవ‌రిని ప్ర‌ధాని మోదీ, అధ్య‌క్షుడు అమిత్ షా ఎంపిక చేస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 2019 ఎన్నిక‌ల నాటికి ఏపీలో […]

పున‌ర్విభ‌జ‌నపై గంద‌ర‌గోళంలో టీడీపీ – బీజేపీ

పున‌ర్విభ‌జ‌న ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ‌డం మాటెలా ఉన్నా.. ఈ పున‌ర్విభ‌జ‌న గురించి కేంద్ర‌మంత్రి వెంక‌య్యనాయుడితో తెగ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఆయన్ను క‌లిసిన ప్ర‌తిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నార‌ట‌. టీడీపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి సుజనా చౌద‌రి మ‌రో అడుగు ముందుకేసి.. మ‌రో నెలరోజుల్లోనే పున‌ర్విభ‌జ‌న ఉంటుంద‌ని ప్ర‌క‌టించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హ‌రిబాబు బ్రేక్ వేశారు. […]

మాణిక్యాల‌రావు మంత్రి ప‌ద‌వికి బీజేపీ ఎమ్మెల్యే ఎర్త్‌

ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌తో పాటు కొత్త‌గా న‌లుగురైదుగురు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రుల‌కు ఖ‌చ్చితంగా ఉద్వాస‌న ఉంటుంద‌ని కూడా టాక్‌. ఇదిలా ఉంటే బాబు కేబినెట్‌లో బీజేపీ నుంచి ఇద్ద‌రు మంత్రులుగా కొన‌సాగుతున్నారు. వీరిలో కైక‌లూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్‌తో పాటు […]

ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మ‌రో ట్విస్ట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒక్క‌సారిగా యూపీలో బీజేపీ జెండా రెప‌రెప‌లాడిన ద‌గ్గ‌ర నుంచి..ఎన్నో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. బ‌ద్ధ శ‌త్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్‌, ప్ర‌ధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజుల‌కే ములాయం చిన్న కొడుకు, కోడ‌లు పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం అక్క‌డి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని, ఈ మేర‌కు బీజేపీ […]

రాష్ట్ర‌ప‌తి పోరులో ఎన్డీయే బ‌లం ఎంత‌..! గ‌ట్టెక్కుతుందా..!

ప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప‌ద‌వీ కాలం మ‌రికొన్ని నెల‌ల్లో ముగుస్తున్న వేళ‌.. కొత్త రాష్ట్రప‌తి ఎవ‌ర‌నే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. అయితే లోక్‌స‌భ‌లో పూర్తి మెజారిటీ ఉన్నా.. రాజ్య‌స‌భ‌లో మాత్రం ఇంకా మెజారిటీ సాధించ‌లేక‌పోయింది. యూపీలో ఘ‌న‌విజ‌యం సాధించినా.. ఇంకా రాజ్య‌స‌భ ఎంపీల ప‌ద‌వీ కాలంపూర్తికాక‌పోడంతో వేచిఉండ‌క తప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో.. రాష్ట్రప‌తి పోరులో ఎన్డీయే ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థి విజ‌యం ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌వుతుంద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. రాజ్య‌స‌భ‌లో మెజారిటీ లేక‌పోవ‌డంతో.. ఇప్ప‌టికే కీల‌క‌మైన బిల్లుల‌ను ఆమోదించుకోలేక […]