‘ పుష్ప ‘ కేశవ రోల్ కు మొదట ఆ యంగ్ హీరోని అనుకున్నాం.. కానీ.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్‌ రష్మిక మందన జంటగా నటించిన మూవీ పుష్ప. సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో కరెక్ట్ ఆర్టిస్ట్ జగదీష్ నటించిన సంగతి తెలిసిందే. కాగా మొదట ఈ సినిమాల్లో కేశవ పాత్ర కోసం యంగ్ హీరో సుహాస్‌ని తీసుకోవాలని భావించామని దర్శకుడు సుకుమార్ చెప్పుకొచ్చాడు. అయితే సుహ‌స్‌ను కేశవ పాత్రకు తీసుకోకపోవడానికి కారణం ఏంటో.. సుకుమార్ ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల ప్రసన్నవాదనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన సుకుమార్.. మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

Pushpa movie Keshava: 'పుష్ప'లో అల్లు అర్జున్ వెన్నంటే ఉండే కేశవ ఎవరు.. బ్యాగ్రౌండ్ ఏంటి.. – News18 తెలుగు

యంగ్ హీరో సుహాస్ హీరోగా అర్జున్ వై. కే. తెర‌కెక్కించిన సినిమా ఇది. పాయల్ రాధాకృష్ణ, రాసిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. సతీసమేతంగా సుకుమార్, మరోదర్శకుడు బుచ్చిబాబు హాజరై సందడి చేశారు. ఇక సుకుమార్ ఈ ఈవెంట్లో సుహాస్ గురించి మాట్లాడుతూ సుహాస్ నువ్వంటే నాకు, బన్నీ గారికి చాలా ఇష్టం. నీ ఎదుగుదల చూస్తూనే ఉన్నాం. పుష్పాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవగా ముందు నిన్నే భావించాం. కానీ అప్పటికే నువ్వు హీరోగా చేస్తున్నావు. నిన్ను ఆ రోల్ కి ఎంపిక చేయడం సరైనది కాదనిపించి నిన్ను అడగలేదు. నాని నటన నాకు చాలా ఇష్టం. సుహాస్ ఫ్యూచర్ నానీల నాకు అనిపిస్తు ఉంటాడు.

Director Sukumar Speech @ Prasanna Vadanam Movie Trailer Launch | Suhas | Manastars - YouTube

సహజ నటుడు నాని కనుక.. నీకు మట్టి నటుడు అని పెట్ట‌డం కరెక్టేమో. అంతలా ఆయా పాత్రలో ఇమిడిపోయి.. నటిస్తావు అంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రాసి సింగ్, పాయల్‌ రాధాకృష్ణ చక్కగా నటించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసి డైరెక్టర్గా మారిన అర్జున్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట‌ వైరల్ అవ్వడంతో.. కేశవ పాత్రలో సుహాసిని తీసుకుని ఉంటే నిజంగానే బాగుండేది అంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సుహాస్ మంచి రోల్ ను మిస్ చేసుకున్నాడు అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.