ఎలక్షన్ సమరంలో బాబాయ్ కోసం బరిలోకి దిగుతున్న అబ్బాయి.. ప్రచారం కోసం పిఠాపురం వస్తున్న మెగా హీరో..?!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజ‌కీయాల‌లో బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ప‌వ‌న్ పోటీ చేస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు కేటాయించడం జరిగింది. వీటిలో పిఠాపురం ఒక‌టి. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఉభ‌య‌ గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజ‌క వ‌ర్గం జనసేననికి కేటాయించారు. ఇక అధికార పార్టీ వైసీపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా వంగా గీత పోటీ చేయనుంది.

పవన్ కళ్యాణ్ కోసం వరుణ్ తేజ్ ఎంట్రీ.. పిఠాపురంలో మెగా ప్రిన్స్ హంగామా.. ఎప్పుడంటే | Varun Tej entry for Pawan Kalyan.. Mega prince election campaign in Pithapuram - Telugu Oneindia

ప్రస్తుతం సీటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంగ గీత బలమైన అభ్యర్థి కావడంతో పవన్ కళ్యాణ్ గెలవడం అంత తెలికైన విషయం కాదు. దీంతో ఆయన ఈ విషయాన్ని సులువుగా తీసుకోవడం లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఇప్పటికే జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, నటుడు పృథ్వీరాజ్ ప్రచారాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా పిఠాపురం ప్రచారానికి వస్తున్నాడంటూ ఆనౌన్స్‌మెంట్ వ‌చ్ఇంది. ఏప్రిల్ 27న అంటే నేడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నాడు.

మధ్యాహ్నం 3:00 నుంచి పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని పవన్‌తో పాటు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వరుణ్ తేజ్ ఓటర్లను విజ్ఞప్తి చేయనున్నాడని తెలుస్తోంది. గతంలోనే వరుణ్ తేజ్ జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి రెడీగా ఉన్నానని.. బాబాయి పిలుపు కోసం వేచి చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. చెప్పినట్లే వరుణ్ తేజ్ నేడు పిఠాపురం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడు.