ఈ ఫోటోలో కనిపిస్తున్న బుల్లి గ్రాడ్యుయేట్ టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో త్రో బ్యాక్ థీంతో స్టార్ హీరో, హీరోయిన్ల సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ తెగ వైర‌ల్ అవుతు్నాయి. అభిమానులు కూడా త‌య ఫేవ‌రేట్ హీరో, హీరోయిన్ల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ త‌మ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పై ఫోటోలో ఉన్న బుల్లి గ్రాడ్యుయేట్ ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతుంది. అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం ఓ భారీ పాన్‌ ఇండియన్‌ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

Samyuktha Menon

ఇంతకీ ఈ అమ్మడు ఎవరో కాదు.. సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టార‌ర్‌గా తెరకెక్కిన భీమ్లా నాయక్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ‌కుట్టి. భీమ్లా నాయక్ లో రానా భార్యగా మెప్పించిన ఈ అమ్మడు.. తన అందం నటనతో ఆకట్టుకుంది. తర్వాత బింబిసారతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్షతో బ్లాక్ బ‌స్టర్ హిట్ సొంతం చేసుకుని హ్యాట్రిక్ హిట్‌ల‌తో గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది.

Nikhil Siddhartha's 'Swayambhu' shoot begins, actor shares first-look  poster - India Today

ఆ తర్వాత కోలీవుడ్ ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ సినిమాలను నటించి మెప్పించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ రావడంతో వరుస ఆఫర్లను అందుకున్న ఈ చిన్నది చివరిగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన డెవిల్.. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ స్వయంభులో హీరోయిన్గా నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటేనే.. మరో పక్క సోషల్ మీడియాలను సందడి చేస్తూ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.