మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు..పవన్ రాజకీయాల పై మహేశ్ బాబు సిస్టర్ సంచలన కామెంట్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . అది ఏ రంగమైనా సరే త్వరలోనే జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ..?ఎవరు గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నారు ..? అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు సినీ స్టార్స్ కూడా రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. తాజాగా మహేష్ బాబు సోదరి మంజుల ఏపీ రాజకీయాలపై స్పందించింది . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఆమె మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు.. ఆయనకు ఎంతో స్టార్ స్టేటస్ ఉంది ..కానీ ప్రజాసేవ చేయాలనుకున్నాడు.. ఆ ఆలోచనతోనే ముందుకెళ్లాడు ..మంచి మనసు కాబట్టి అలా వెళ్లారు అనుకుంటున్నాను ..ఇలాంటి లీడర్లు మనకు చాలా అవసరం ..స్వార్థం లేని లీడర్లే ఇప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ..పవన్తో నాకు ఎటువంటి వ్యక్తిగత పరిచయం లేకపోయినప్పటికీ.. నేను చూస్తున్న దాని ప్రకారం.. వింటున్న దాని ప్రకారం రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్.. మనసు నుండి వచ్చిందని అనిపిస్తుంది”..

“మనసు చెప్పిందే విని వెళ్లే వాళ్లంటే నాకు చాలా చాలా ఇష్టం ..అందులో పవన్ కళ్యాణ్ ముందు ఉంటాడు.. టాలీవుడ్ హీరో కాబట్టి సినిమాలు చేసుకుంటూ కూడా రాజకీయాల్లో గడపొచ్చు.. రాజకీయాల్లో ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని ముందుకెళ్తారు.. అలాగే గెలుపు వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో మంజుల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి .జనసేన ఫ్యాన్స్ ఇప్పుడు మంజుల మాటలు బాగా ట్రెండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మంజుల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అయితే మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు జనసైనికులు..!!