పాటలే లేకుండా అనిరుథ్, జెర్సీ డైరెక్టర్ కాంబో మూవీ.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..?!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో అందరికీ మంచి అంచనాలు ఉన్న సినిమా వీడి 12. ఈ సినిమాకు డైరెక్టర్గా గౌతం తిన్న‌నూరి వ్యవహరించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొన్నాయి. గౌత‌మ్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కువచ్చిన మళ్లీ రావే, జెర్సీ సినిమాలు ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ 12వ సినిమాకు ఈయన దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఒక క్రేజీ టాక్ నెటింట‌ వైరల్ గా మారింది. తాజా అప్డేట్స్ ప్రకారం ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గూఢ‌చారి రోల్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

Vijay Deverakonda's film with Gowtam Tinnanuri has not been shelved -  Hindustan Times

అయితే ఈ సినిమాలో క‌థ‌ అనుగుణంగా పాటలు అవసరం లేదట. కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉండబోతుందని టాక్. అయితే ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అనిరుధ్‌ సినిమా అంటే అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్, బీట్ సాంగ్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో పూర్తిస్థాయిలో పాటల లేవనే టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.

Анируд Равичандер — Википедия, 46% OFF

కథ అనుగూనంగా ఎమోషన్స్‌ను ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదని ఉద్దేశంతోనే పాటలు వద్దనుకున్నారట. కానీ అక్కడక్కడ వచ్చే బీట్ సాంగ్స్ వినిపిస్తాయని సమాచారం. త్వరలో ఈ విషయంపై మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా స్కెడ్యూల్ విశాఖపట్నంలో జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగ వంశీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రేమలో ఫేమ్ మ‌మితా బైజూ లేదా భాగ్యశ్రీ బోర్‌సే వీరిద్దరిలో ఒకరు హీరోయిన్గా నటించనున్నారు. అయితే ఈ సినిమాలో సాంగ్స్ పని లేకపోవడం.. కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఉందని తెలియడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.