కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ఈయన.. లక్షలాది మంది అభిమాని హీరోగా మారాడు. రజనీకాంత్ కు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. ఆయన సినిమాలు కేవలం భారత్‌లోనే కాకుండా జపాన్, చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ లాంటి విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. బస్ కండక్టర్గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఈయన.. తన స్టైల్‌తో, నటనతో దర్శకుల దృష్టిని ఆకట్టుకుని సినిమా హీరోగా అవకాశాల్ని అందుకున్నాడు.
కండెక్టర్ నుంచి క్రమక్రమంగా సూపర్ స్టార్ గా ఎదిగిన రజిని మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని.. ఇప్పటికి స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఏడుపదుల వయసు దాటుతున్న ఇప్పటికీ యంగ్ హీరోస్ తో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంటున్నాడు. సరైన కంటెంట్ ఒకటి పడితే.. ఏ రేంజ్ లో కలెక్షన్లు సునామీ సృష్టిస్తాడు ఇటీవల రిలీజ్ అయిన జైలర్ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే తన జీవితంలో ఎన్నో అవమానాలు.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రజినీకాంత్.. రియల్ లైఫ్ స్టోరీ ని బయోపిక్ చేస్తే చూడాలని ఆసక్తి ఎంతో మందిలో ఉంటుంది. ఈ క్రమంలో రజిని బయోపిక్ చూడాలనుకునే ఎంతోమంది కల నెరవేరనుంది. బాలీవుడ్ మేకర్ సాజిద్ నడియద్వాల తాజాగా రజిని బయోపిక్ హక్కులను సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఆయన బయోపిక్ సంబంధించిన స్క్రిప్ట్ వరకు జరుగుతుందని.. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రజనీ పాత్రలో ఎవరు నటిస్తారో.. మిగిలిన క్యాస్టింగ్ వివరాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రజనీకాంత్ పాత్రలో నటించడం అంటే అంత సులువు కాదు. ఆయన స్టైల్, మ్యానరిజం గ్రిప్ లో పెట్టుకోవాలి. ఆయనల అచ్చుగుద్దినట్లు నటించడం చాలా కష్టం.. అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నటనలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ వ్యక్తిని రజనీకాంతులా ఆడియన్స్ ఊహించుకోవడం కష్టతరమవుతుంది. ఇక్కడ రజనీకాంత్ పాత్రలో ఎవరు నటిస్తారో.. ఆయన మ్యానరిజం, స్టైల్ బ్యాలెన్స్ చేయగల నటుడు ఎవరో.. సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.