ప్రభాస్ ‘ సలార్ ‘ ప్రమోషన్స్ కి నో చెప్పడానికి వెనుక ఉన్న షాకింగ్ రీజన్ అదేనా..?!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న‌ ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ ను దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తరుకెక్కడం, ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. అయితే తాజాగా సలార్ నుంచి రిలీజైన ట్రైలర్కు వ్యూస్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌టుకోలేదు. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా ట్రైలర్ లేదని, అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Salaar: Prabhas' Actioner Riding On A Monstrous 200 Crore Budget For A Two-Part Franchise?

ప్రభాస్ రెండు నిమిషాల వరకు ట్రైలర్లు కనిపించని లేదు అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు భారీ హైప్‌తో ఉన్న సలార్ మూవీకి ఇప్పుడు ఆ రేంజ్‌లో హైప్ లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతోఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచేందుకు మరో యాక్షన్ ట్రైలర్ నీ నెల 17న రిలీజ్ చేయబోతున్నారట టీం.డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు పట్టుమని పది రోజులు లేవు. ఇంకా సినిమా ప్రమోషన్స్ మాత్రం మొదలుపెట్టలేదు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Prabhas' Salaar movie updates

మళ్ళీ సినిమా వాయిదా వేయడం లేదు కదా అనే సందేహాలు కూడా ఆడియన్స్లో వినిపించాయి. ఇక రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందని అర్థమైంది. ఈ సినిమా సెన్సార్ సభ్యులు ఏ రేటింగ్ ఇచ్చారు. సినిమాలోని సెకండ్ హాఫ్ లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు వైలెన్స్ సరికొత్త అర్థం ఇచ్చేలా ఉన్నాయ‌ని అందుకే ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సభ్యులు వివరించారు.

20 Years Of Prabhas: Salaar To Project K, Movies Of The, 49% OFF

అయితే సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు కాకపోవడానికి కారణం ఏంటో ప్రమోషన్స్ కి ప్రభాస్ రానని నిర్మాతలకు కరాకండిగా చెప్పడ‌మేన‌ట‌. ప్రభాస్ మోకాళ్ళకు సర్జరీ జరగడమే విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రమోషన్ జరగడం లేదని సోషల్ మీడియాలో న్యూస్ వినిపించింది. అయితే అసలు విషయం అది కాదట.. ప్రభాస్‌కి సినిమా వాయిదా వేసిన‌ప్ప‌టినుంచి ద‌ర్శ‌క, నిర్మాతలపై చాలా కోపం వచ్చిందని.. అందుకే ప్రమోషన్స్ కి రానని సీరియస్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఇక ప్రభాస్ రానప్పుడు మనమేం ప్రమోషన్స్ చేస్తామని నిర్మాతలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా రద్దు చేశారట‌.