నాగార్జున అంత దుర్మార్గుడా….? ఆ స్టార్ హీరోని అలా అవమానించాడా..?

ప్రజెంట్ ఇప్పుడు అందరు కళ్ళు కూడా అక్కినేని నాగార్జున పై మాత్రమే పడ్డాయి. జనరల్ గా పాన్ ఇండియా హీరోస్ పై మాత్రమే ఇలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున పై కూడా అలాంటి ఓ హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . దానికి కారణం కుబేర . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫీల్ గుడ్ ఫిలిం డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు . దీనికి సంబంధించిన లుక్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. లుక్స్ పరంగా కెవ్వు కేక అనిపిస్తున్నాడు నాగార్జున .

అంతేకాదు ధనుష్ ఈ సినిమాలో పేదవాడిగా నటించబోతున్నాడట . శ్రీ వెంకటేశ్వర సినిమాస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ పాన్ ఇండియా ఫిలిం టీజర్ త్వరలోనే రాబోతుంది . ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ ఫిలిం కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ లైన్ హాట్ టాపిక్ గా డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. డబ్బు ఉంది అని విర్రవీగుతున్న నాగార్జునకు అసలు డబ్బు విలువ తెలియజేసేలా చేస్తాడు ధనుష్ అంటూ తెలుస్తుంది . నోటు కింద పడితే వదిలేసే టైప్ నాగార్జున .. ఒక్క ముక్క కూడా వదలకుండా తినే టైప్ ధనుష్ . దేవుడు లేకపోతే ఏదీ లేదు అనే విధమైన కాన్సెప్ట్ తో ఈ మూవీ .

దేవుడే దిక్కు అనే విధంగా ఉండే ధనుష్ ..తల పొగరుతో ఉండే నాగార్జునకు ఎలా డబ్బు విలువ తెలియజేస్తాడు అనేది అసలు కాన్సెప్ట్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు కుబేరుడుగా ఉన్న నాగార్జునను తొక్కేసి ధనుష్ కుబేరుడు గా ఎలా మారుతాడు ..?నీతి నిజాయితీతో బతకడం ఎలా..? హెడ్ వెయిట్ పొగరు ఉంటే ఎలా కెరియర్ నాశనం అవుతుంది అనే విషయాలను ఈ సినిమాలో బాగా క్లియర్ గా చూపించబోతున్నాడట శేఖర్ కమ్ముల. నాగార్జున నెగిటివ్ షేట్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం హైలెట్గా నిలవబోతోంది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన చిన్న బిట్ ద్వారానే అర్థమైపోతుంది . అంతేకాదు ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారట . మరి ముఖ్యంగా అన్నం తినేటప్పుడు ధనుష్ ని నాగార్జున దారుణంగా అవమానిస్తారట . ఆ ఎక్స్ప్రెషన్స్ రియల్ గా ఉండడానికి నిజంగానే నాగార్జునా చేత కఠినమైన పనులు కూడా చేయించారట . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!