తన లైఫ్ లో నాగ్ అలా పిలిచిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..? సో స్పెషల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువగానే ఉంటుంది. అక్కినేని హీరో కదా..? ఆ రేంజ్ వేరే లెవల్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా నాగార్జున ..ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే పాత్రలను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . అంతేకాదు కుర్రాళ్ళు యువత ఇష్టపడే రోల్స్ లో కూడా నటించి మెప్పించారు.

ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. నాగార్జున తన కెరియర్ లో అన్నా అని పిలిచిన ఒకే ఒక్క హీరోకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ . నందమూరి నటసార్వభౌముడు తారక రామారావు గారి కొడుకు .

ఎస్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు నాగ్. హరికృష్ణ – నాగార్జున కాంబోలో వచ్చిన సినిమా సీతారామరాజు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ముందు నుంచే వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారట. అంతేకాదు నాగార్జున ఎప్పుడు హరికృష్ణను అన్నా అన్నా అంటూ పిలిచేవారట . ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్కి ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పడం గమనార్హం. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!