ప్రభాస్ సినిమాలో ఆ ఒకప్పటి స్టార్ హీరో.. భలే ఛాన్స్ కొట్టేశాడే..!

ప్రభాస్ ..ప్రెసెంట్ ఎలా పాన్ ఇండియా సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడొ మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసే మూవీస్ గానే ఉండబోతున్నాయి . ఈ క్రమంలోనే ప్రజెంట్ కల్కి 2898ఏడి సినిమా ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నాడు. ప్రభాస్ ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పై కి తీసుకురాబోతున్నారట .

అయితే ఇలాంటి మూమెంట్లోనే.. ప్రభాస్ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో నటించబోతున్నాడు అనే వార్త బాగా వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు వడ్డే నవీన్ . ఇప్పుడంటే ఈయన పేరు చెప్తే జనాలు గుర్తుపట్టరు ఏమో . కానీ ఒకప్పుడు ఈయన పేరు చెప్తే అమ్మాయిలు ఓ రేంజ్ లో అరిచేసేవారు . అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్ .

కాగా వడ్డే నవీన్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారట . చాలా కాలం తర్వాత వడ్డే నవీన్ మళ్లీ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర ఆయన కెరియర్ను మళ్ళీ ముందులా తీసుకెళ్లే ప్రయత్నాలు చేసే విధంగా ఉంటుందట . కచ్చితంగా ప్రభాస్ సినిమాతో వడ్డే నవీన్ కెరియల్ మారిపోతుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?