ఖాళీగా ఉన్న నో ప్రాబ్లం.. ఏ సినిమాలో పడితే ఆ సినిమాల్లో అసలు నటించం అంటున్న హీరోయిన్స్ వీళ్లే..?!

ఇటీవల సినీ ఇండస్ట్రీట్ ట్రెండ్‌ మొత్తం మారిపోయింది. హీరోయిన్స్ కి ఆఫర్స్ రావడమే చాలా గొప్ప అన్నట్లుగా ఒకప్పుడు పరిస్థితి ఉండేది. ఓ సినిమా స్టార్ట్ అవుతుంది అంటే హీరోయిన్ రోల్ కి బోలెడన్ని ఆప్షన్లు ఉండేవి. అందుకే చాలామంది హీరోయిన్స్ త్వరగా నే ఫేడ్ అవుట్ అయిపోయేవారు. పైగా హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పేన్ చాలా తక్కువగా ఉండేది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఫార్ములాను హీరోయిన్స్ బాగా ఫాలో అవుతూ ఉండేవారు. వచ్చిన ప్రతి సినిమాను ఒప్పేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు.

The Rise of South Indian Actress Sai Pallavi: From Medical Student to Film  Star - World Explore Web

అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ పోకడ మారిపోయింది. చాలామంది హీరోయిన్లు ఖాళీగా అయినా ఉంటాం కానీ ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా నటించము అని డిసైడ్ అవుతున్నారు. ఇంతకీ అలా కేవలం తమకు నచ్చి.. కనెక్ట్ అయిన సినిమాల్లో మాత్రమే నటించే స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఒకసారి చూద్దాం. వారిలో మొద‌ట పేరు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ ముద్దుగుమ్మ లేడి పవర్ స్టార్ గా టాలీవుడ్ లో భారీ పాపులారిటి దక్కించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్న సాయి పల్లవి.. పాత్రకు ప్రాధాన్యత ఉండి.. కథలో కంటెంట్ ఉందనిపిస్తేనే ఆ సినిమాలో నటిస్తుంది.

Images

రెమ్యున‌రేషన్ కూడా చాలా రీజనబుల్‌గా తీసుకునే ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణంలో సీతా పాత్ర‌లో నటిస్తోంది. న్యాచుర‌ల్‌ స్టార్ నాని జెంటిల్మెన్ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుణ్ మోహన్. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా కాలం అవుతున్న అతి తక్కువ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. ఏ సినిమా పడితే ఆ సినిమాలో నటించకుండా ఆచితూచి కథలలో ఎంచుకుంటుంది. ప్రస్తుతం మరోసారి నానితో జతకట్టింది ప్రియాంక. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను అంటున్న హీరోయిన్స్

మరో హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ నాని జెస్సి మూవీ తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ.. కేవలం కథ నచ్చి కంటెంట్ ఉందనిపిస్తేనే సినిమాల్లో నటిస్తుంది. అలా చాలా క‌థ‌లో అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉంది. సల్లార్‌ సినిమాతో శ్రియా రెడ్డి భారీ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఈమె హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించింది. గత కొంతకాలంగా ఎన్నో వందల కథలు విన్నా కూడా చాలా తక్కువ సినిమాల్లోనే నటించిన ఈ అమ్మడు.. కేవలం కథ నచ్చి, తన పాత్రకు 100% ఇవ్వగలన‌ని అనిపిస్తేనే నటిస్తుంది.

తమిళ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన నజ‌రియా.. రాజా రాణి సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే నాని అంటే సుందరానికి సినిమాలోను నటించింది. అతి తక్కువ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు చాలా కథలను విన్న ఒకటి రెండు సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కథ‌ ఎంతో ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తే గాని నజ్రియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని తెలుస్తోంది.