దేవర నుంచి అద్దిరిపోయే సర్ ప్రైజ్ వచ్చేసిందిరోయ్.. గూస్ బంప్స్ మోతే(వీడియో)..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకి గూస్ బంప్స్ అప్డేట్ అనే చెప్పాలి . జూనియర్ ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా దేవర సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ రాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు . అయితే దానికి కొన్ని రోజుల ముందే కొరటాల శివ నందమూరి అభిమానులను సాటిస్ఫై చేశారు . యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించిన ఫియర్ సాంగ్ ప్రోమో నేడు రిలీజ్ అయింది.

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇది ఓ పెద్ద సంచలనంగా మారింది. దేవర చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులు కనివిని ఎరుగని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న విషయం తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. కాగా డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫియర్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు .

ఈ పాటని మే 19న రిలీజ్ చేయబోతున్నారు . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సాంగ్ లో తారక్ తన సైన్యంతో సముద్రంలో కదిలి వస్తున్నట్లు విజువల్స్ కనిపిస్తున్నాయి . అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి భారీ భారీ ప్లస్ గా మారబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి కొరటాల శివ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఓ భారీ హీట్ని తమ ఖాతాలో వేసుకోవడానికి పక్కాగా ఫిక్స్ అయ్యారు అంటూ జస్ట్ చిన్న ప్రోమో ద్వారానే తెలిసిపోతుంది. చూద్దాం మరి టోటల్ పాట రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో..??