దారుణంగా మోసపోయిన శ్రీముఖి..అక్క అక్క అంటూ పెద్ద బొక్క పెట్టిందిగా..!

యాంకర్ శ్రీముఖి దారుణంగా మోసపోయిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . లౌడ్ స్పీకర్ .. ఓ రాములమ్మ ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. మరీ ముఖ్యంగా తనదైన స్టైల్ లో హై ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటుంది . కాగా రీసెంట్గా శ్రీముఖి ఓ బడా స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్ నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది .

ఆయన మరెవరో కాదు..చిరంజీవి. విశ్వంభర సినిమాలో వశిష్ట ఐటం సాంగ్ కోసం శ్రీముఖిని చూస్ చేసుకున్నాడు అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అయింది. కాగా ఇప్పుడు ఆ ఆఫర్ శ్రీముఖి చేతి నుంచి మరో అమ్మాయికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. శ్రీముఖితో పాటు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానం అందుకున్న ఈ బ్యూటీ ఆ ఆఫర్ ని ఎగరేసుకుపోయిందట . అంతేకాదు శ్రీముఖిని అక్క అక్క అంటూ పిలిచే బ్యూటీ మెత్తగా బొక్క పెట్టింది అంటూ జనాలు శ్రీముఖిని ట్రోల్ చేస్తున్నారు .

అంతేనా శ్రీముఖి ఖాతాలో ఇంత పెద్ద ఆఫర్ మిస్ అయిపోవడంతో ఫాన్స్ కూడా డీలా పడిపోతున్నారు . అయితే కొంతమంది మాత్రం చిరంజీవి – శ్రీముఖి కాంబో అస్సలు బాగోదు అంటూ మండిపడుతున్నారు . మొత్తానికి శ్రీముఖికి ఇది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. చూద్దాం శ్రీముఖీ దీని పై ఎలా స్పందిస్తుందో..? ఏ విధంగా ఆ బాధ నుండి బయటపడుతుందో..? ప్రసెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారైంది..!!