మమిత బైజు అంటే ఈ తెలుగు హీరోకి అంత పిచ్చా ..? ఇష్టంతో ఏం చేశాడో తెలుసా..?

మమిత బైజు.. ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు.. అమ్మడు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే . ఇప్పుడు ఏ కుర్రాళ్ల హాస్టల్స్ లో చూసిన సరే మమిత ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏకంగా మూడు బడా సినిమాలను అందుకోవడం సంచలనంగా మారింది .

ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమాలో నటిస్తున్న మమిత బైజు .. నాని నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతుందట. అంతేకాదు దేవర పార్ట్ 2 లో కూడా మమిత బైజు కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమాలోనే ఆమె ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కి సినిమాలో సెకండ్ హీరోయిన్గా మమితాను చూస్ చేసుకున్నారట మేకర్స్.

నిజానికి ఈ పాత్ర కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ ని అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత ఆమెను రిజెక్ట్ చేసి రాంచరణ్ స్వయంగా మమిత బైజు పేరుని చూస్ చేసుకున్నారట. దీంతో అంత పెద్ద గ్లోబల్ స్టార్ మమిత బైజు నటనకు ఫిదా అవ్వడంతో అందరూ షాక్ అయిపోతున్నారు . అయితే కొంతమంది ఈ ఆఫర్ రావడం పట్ల రాజమౌళి హస్తము ఉంది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు . మొత్తానికి గ్లోబల్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుని లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ మలయాళీ పిల్ల..!