అప్పుడు రవితేజ్..ఇప్పుడు ఈ మాస్ హీరో..పూరి జగన్నాథ్ కి మరో ఇడియట్ దొరికేసాడురోయ్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ తన కెరియర్ మలుపు తిప్పిన సినిమా ఏది అంటే మాత్రం అందరూ టక్కున చెప్పేది ఇడియట్. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. బద్రి సినిమాలు కూడా బాగుంటాయి. కానీ ఇడియట్ సినిమా మాత్రం మరి ఏ డైరెక్టర్ కూడా తెరకెక్కించలేడు . అలాంటి ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది పూరి జగన్నాథ్ కి ..ఈ ఇడియట్ సినిమా .

ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అయితే ఇడియట్ సినిమాకి ఇన్నాళ్లకు సీక్వెల్ రాబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . త్వరలోనే ఇడియట్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతుందట . అయితే ఇడియట్ సినిమాలో రవితేజ నటించినా.. ఇడియట్ 2 సినిమాలో తేజ సజ్జ నటించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో రక్షిత ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ హీరోయిన్గా శ్రీ లీల నటించబోతుందట .

అప్పట్లో ‘చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్’ ఏ రేంజ్ లో అల్లాడించిందో మనకు తెలిసిందే . అలాంటి కాంబో మళ్లీ రావాలి అంటూ ఆశపడుతున్నారు జనాలు. ఒకవేళ అలాంటి కాంబో మిస్ అయిన ఆ సినిమాని గుర్తు చేసే వైబ్స్ వస్తే మాత్రం రచ్చ రంబోలానే.. ఒకప్పుడు రవితేజ కెరియర్ ఇడియట్ వల్ల ఎలా మారిందో.. ఇప్పుడు ఇడియట్ 2 వల్ల తేజా సబ్జా కెరియర్ కూడా అలాగే మారిపోబోతుంది అంటున్నారు జనాలు..!!