మాస్ మహారాజు ఆ స్టోరీ రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. ?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ హిట్‌గా నిలవడమే కాదు.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇలా ఆయన నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోవడంతో మాస్ మహారాజ్‌కి తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న రవితేజ ఈ సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడు.

Ravi Teja announces new film titled 'Mr Bachchan' - The Hindu

ఇప్పటికే మాస్ మహారాజ్ గా తనకంటూ గొప్ప క్రేజ్ సంపాదించుకున్న ఈయ‌న‌ ఈ సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని దృఢ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజ ఈ సినిమాతో మరోసారి తనను స్టార్ గా ఎలివేట్ చేసుకోవాలని శ్రమిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో రవితేజ గోపీచంద్ డైరెక్షన్లో ఓ సినిమాను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.

Ravi Teja Announces His Fourth Collaboration With Gopichand Malineni For  His Next Film Shared Rt4gm First Look - Amar Ujala Hindi News Live - Ravi  Teja:रवि तेजा ने अगली फिल्म के लिए

అయితే దీనికి ఓవర్ బడ్జెట్ అవుతుందని ప్రొడ్యూసర్ ఈ సినిమాను రిజెక్ట్ చేస్తాడని.. దీంతో రవితేజని కొంతవరకు రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పిన ఆయన కూడా తగ్గకపోవడంతో ఆ సినిమాను వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ లాంటి స్టార్ హీరో రెమ్యూనరేషన్ సాకుగా పెట్టి మంచి కంటెంట్ ను వదులుకోవడం అసలు సరైనది కాదు అంటూ కామెంట్లు వ్యక్తమౌన్నాయి. అయితే రవితేజ కూడా ఇప్పుడు ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు చాలా వరకు బాధపడుతున్నాడని టాక్.