ఆడిషన్స్ అంటూ వచ్చి నిర్మాతను నిలువెత్తున దోచేసిన నటుడు.. వీడు మహా కిలాడినే..?!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన వ్యక్తి అదే సినిమా నిర్మాతతో మందు తాగిపించి నిర్మాత వంటిపై ఉన్న ఆభరణాలతో పరారైన ఘటన చోటు చూసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. పోలీసులు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణానగర్ లో ఓ రెస్టారెంట్ భవనంలో ఎల్లాలు బాబు అనే ఓ నిర్మాత సినిమా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఒక సినిమా చేయాలనే ప్రయత్నంతో ఉన్న ఆయన ఈ నేపథ్యంలో ఆడిషన్స్ కోసం కాస్టింగ్ కాల్‌కు పిలుపునిచ్చారు.

Silhouette of two people drinking wine Stock Photos - Page 1 : Masterfile

ఇక బుధవారం నాడు అక్కడ ఆడిషన్స్ కోసం శ్రీకాంత్ అనే ఒక కుర్రాడు రావడం.. కాస్త పరిచయం ఏర్పడడంతో సదర నిర్మాత రెండు గంటల తర్వాత తినడానికి ఏమైనా తీసుకురావాలని ఆ యువకుడిని కోరాడట. అయితే శ్రీకాంత్ కేవలం ఆహారం మాత్రమే తీసుకురాకుండా.. మద్యం కూడా తీసుకువచ్చి నిర్మాత తో కలిసి సిట్టింగ్ వేశాడు. ఇక ఆ ప్రొడ్యూసర్ కు మందు కాస్త ఎక్కువ అవ్వడంతో తన ఒంటి మీద ఉన్న పది తులాల బంగారం.. గొలుసు, చేతికున్న 3 ఉంగరాలు, జేబులో ఉన్న రూ.50 వేలు, కాస్ట్లీ వాచ్ ఇలా అన్ని నగదు బల్ల మీద పెట్టి మరీ తాగి పడిపోయారు.

Man in Hood silhouette. Boy in a hooded sweatshirt Stock Photo | Adobe Stock

ఇంకేముంది కాసేపటికి గాఢమైన మత్తులోకి జారిపోవడం ఇదే అదునుగా చూసిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ బంగారు వస్తువులతో పాటు డబ్బులు కూడా కాజేసి సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నాడట. లేచి చూసి శ్రీకాంత్‌తో పాటు తన వస్తువులు కూడా లేవన్న విషయం అర్థం చేసుకున్న నిర్మాత వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి శ్రీకాంత్ కోసం ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో వీడు మామూలు కిలాడి కాదు.. ఏకంగా నిర్మాతనే లైన్లో పెట్టి తెలివిగా దెబ్బతీశాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.