ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడ‌కుండా.. సొంత కాళ్లపై ఎదుగుతున్న స్టార్ సెలబ్రెటీస్ ఎవరంటే..?!

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూ చాలామంది నటీనటులు ఏదో ఒక బ్యాగ్రౌండ్ ఉంటే అవకాశాలు దొరుకుతాయని భావిస్తూ ఉంటారు. కానీ అందరికీ అదృష్టం కలిసి రాదు. అందుకే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ అయిన వారి పైన ఆడియన్స్‌లోను మంచి రెస్పెక్ట్ ఉంటుంది. అయితే కొంతమంది ఇక్కడ ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా దానిని ఉపయోగించకుండా వారి సొంత ప్రయత్నాలు చేస్తూ వారి కాళ్లపై వాళ్లు నిలబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు సక్సెస్ సాధిస్తూ ఉంటారు.

Kamakshi Bhaskarla Radiates Glamour in Latest Photos! | Kamakshi Bhaskarla  Radiates Glamour in Latest Photos!

అలా ఎదగడంలో ఒక తృప్తి ఉందని వారి అభిప్రాయం. తమ టాలెంట్ చూసి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని తమకున్న బ్యాగ్రౌండ్తో అవకాశం ఇవ్వమని ఎవరిని అడగమంటూ కొంతమంది వారి లిమిట్స్‌లోనే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సెలబ్రిటీల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. పొలిమేర, విరూపాక్ష సినిమాల్లో నటించి భారీ పాపులాటి దక్కించుకున్న నటి కామాక్షి భాస్కర్ల. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఈమె పేరు మారుమోగిపోతుంది. టాలీవుడ్‌లో చాలామంది ఫ్రెండ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఆమె ఎవరి సహాయం తీసుకోకుండా తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Spotlight: Can Sangeet Shobhan do the opposite of Santosh Shobhan? | Can  Sangeet Shobhan do the opposite of Santosh Shobhan

అలాగే మరో యంగ్ హీరో సంగీత్ శోభన్ కూడా తండ్రి శోభన్ పేరు ఎక్కడ వాడకుండానే, సోదరుడు సంతోష్ శోభన్ పేరును యూస్ చేసుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన ప్రయత్నాలు బాగా వర్క్ అవుట్ అయినట్లు కనిపిస్తుంది. అన్న కంటే ఎక్కువ సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ బామ్మర్ది యంగ్ హీరో వీర ఇండస్ట్రీలో ఉన్నాడన్న సంగతి చాలామందికి తెలియదు. ఇటీవల కాలంలో చిన్న పాత్రల్లో నటిస్తూ అందరిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

Allu Arjun Brother in Law Viran Muttamsetty Movie Mukyagamanika Lyrical  Video Launch | MCT - YouTube

అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకుని.. టాలీవుడ్ లోనూ పలు సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా.. కోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు అయినా ఎక్కడ తండ్రి పేరు వాడకుండా అవకాశాల కోసం కష్టపడి ప్రయత్నిస్తు ఎదిగాడు. ఈయన కెరీర్‌ స్టార్టింగ్‌లో సాధారణ హీరో సినిమాలానే.. ఎటువంటి హంగు లేకుండా రిలీజ్ అయ్యేది. ఏ రోజు తన కొడుకు సినిమా ఫంక్షన్ కి వచ్చి సినిమా చూడండి అంటూ మమ్ముట్టి అడిగింది లేదు.

Mammootty, Dulquer Salmaan to share screen space in Bilal? Chup actor has  THIS to say - India Today