పవన్ ప్రచారంలో తారక్ ఫొటోస్ చూపించిన ఫ్యాన్స్.. పవర్ స్టార్ రియాక్షన్ ఇదే. .?!

టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ చాలాసార్లు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగగా.. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్‌కుఅనుకూలంగా రిజల్ట్ వస్తే.. మరికొన్నిసార్లు ఎన్టీఆర్‌కు సక్సెస్ అందింది. ఇక‌ 2009 ఎన్నికల టైం లో టీడీపీ తరఫున తారక్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఈయన పొలిటికల్గా తన గురించి ఎంత ప్రచారం జరుగుతున్న నోరు మెదపడం లేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోవైపు జనసేన పార్టీని స్థాపించి త్వరలోనే జరగనున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పొత్తుకుదురుచుకున్న సంగతి తెలిసిందే.

Jr.NTR about Pawan kalyan

జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్‌కు స్పీచ్ మాట్లాడుతున్న సమయంలో.. ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫోటోలను చూపించగా.. పవన్ కళ్యాణ్ స్పీచ్ మాట్లాడుతూనే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవన్, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో దీంతో అర్థమవుతుందంటూ.. ఎప్పటికీ వీరిద్దరి బంధం ఇలానే కొనసాగాలంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో కచ్చితంగా గెలుస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు.

BJP silent, but TDP is vocal in support of Pawan Kalyan

సర్వే ఫలితాలు కూడా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ఉండడం గమనార్హం. కూటమి గెలిస్తే పవన్ నెంబర్ 2 అవుతారని అంత కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఉద్దేశంతో భారీ ఖర్చు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం మెగా హీరోలు కూడా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారానికి రంగంలో దిగిన సంగతి తెలిసిందే. పవన్ తన రెమ్యూనరేషన్ కూడా పూర్తిస్థాయిలో త్యాగం చేసి రాజకీయాలపై దృష్టి సారించాడు. ఆయనకు అనుకూల ఫలితం వస్తుందో లేదో చూడాలంటే ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.