బాలయ్య అల్లుడు శ్రీ భరత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్.. ట్విట్ వైరల్..?!

నందమూరి నటసింహం బాలయ్య ఓ పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోపక్క రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ జనానికి దగ్గరవుతున్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగనున్నారు. నిజానికి గీతం సంస్థల అధినేత ఎంఎండిఎస్ మూర్తి మనవడిగా శ్రీ భరత్‌కు మంచి పేరు ఉంది. కానీ 2019 ఎన్నికల్లో అప్పటి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎం.వీ.వీ.సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు శ్రీ భరత్.

Sribharat Mathukumilli | ఈరోజు యువగళం పాదయాత్ర లో భాగంగా అద్దంకి వద్ద నా పుట... | Instagram

అయినా సరే మరోసారి ఆయన అదే ప్లేస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కూటమి బలపరిచిన టీడీపీ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఈయన భారీ ఎత్తున ప్రచారం జరుపుతున్నారు. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న హీరోయిన్ పూనాంకౌర్‌ భారత్‌ను ఉద్దేశిస్తూ ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో చూస్తుంటే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఏదో సాధించే లాగా కనిపిస్తున్నాడు అంటూ ఆమె చేసిన ట్విట్ నెటింట‌ వైరల్ గా మారింది. విశాఖపట్నం నుంచి అతను గెలిచి పార్లమెంటుకు వెళితే అది నిజంగా అద్భుతంగా ఉంటుందని ఆమె వివరించింది.

Poonam Kaur on the Supreme Court's verdict on abortion | Telugu Cinema

ఎడ్యుకేషన్ గురించి భవిష్యత్తు గురించి అతనికి ఉన్న విజన్ కేవలం ఒక రాష్ట్రానికే లిమిటెడ్ గా ఉండకూడదు అన్నట్లుగా ఆమె ట్విట్ షేర్ చేసింది. తన సపోర్ట్ భరత్‌కంటూ పేర్కొన్న ఆమె.. ఇది ఎవరు డబ్బు ఇచ్చి పెట్టించిన ట్విట్ కాదంటూ వివరించింది. అలాగే స్పాన్సర్ చేసిన ట్వీట్ కాదు అంటూ వివ‌రించింది. ప్రస్తుతం పూనం చేస్తున్న కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో.. నిన్న మొన్నటి వరకు జగన్‌కు సపోర్ట్ చేస్తూ.. కూటమిలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్‌ను త్రివిక్రమ్ ఇన్ డైరెక్ట్ గా దూషించినా.. ఈ అమ్మడు అదే కూటమిలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న భరత్‌ పై ప్రశంసలు వర్షం కురిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.