పవన్ కూడా ఆ జాతే.. ఇలా చేస్తాడు అని కలలో కూడా ఊహించలేదుగా..!?

పనీపాటా లేని బ్యాచ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పైనే కళ్ళు ఉంటాయి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటే జనాలు ఏదేదో అనుకున్నారు . అయితే మరోసారి అది కరెక్టే అంటూ ప్రూవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది. పిఠాపురంలో ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రార్థించింది . సర్వేల ప్రకారం పవన్ కళ్యాణ్ భారీ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అంటూ తెలుస్తుంది. కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఒక విషయంలో ఉండడం ఫాన్స్ కి హర్టింగ్గా అనిపిస్తుంది.

ఏ హీరో అయినా ఏ నాయకుడైనా సరే అందరిని కూల్ చేయాలి ..శాంత పరచాలి పెద్దదిక్కుగా వ్యవహరించాలి. అదే ఒక లీడర్ లక్షణం . అయితే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య వార్ ఎలా పిక్స్ కి చేరుకుందో చూస్తున్నాము. అల్లు అర్జున్ – వైసీపీ క్యాండిడేట్ రవికి సపోర్ట్ చేయడమే దీని అంతటికి కారణం . మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు సైతం మతులు పోయే రేంజ్ లో ట్వీట్ చేశాడు . అల్లు అర్జున్ కూడా ఘాటుగా ఓ కౌంటర్ ఇచ్చాడు .

ఇవన్నీ మనకు తెలిసిందే అయితే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీకి పెద్దదిక్కుగా ఉండే చిరంజీవి కానీ ఈ ఇష్యూ పై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఫాన్స్ కొట్టుకొని చచ్చిపోయే రేంజ్ లో ఉన్నారు. అయినా వీళ్ళు ఏం మాట్లాడకపోవడంతో జనాలు మండిపడుతున్నారు. పవన్ కూడా సైలెంట్ గా తన పని తాను చూసుకో పోయేటైపే అందుకే ఏ విషయాలను పట్టించుకోవడం లేదు అంటుంటే మరికొందరు రాజకీయాల్లోకి వచ్చాక అది కామన్.. రాజకీయాలు అంటేనే అంత.. ఎవరైనా సరే రాజకీయాలకు రంగు పూసుకోవాల్సిందే ..పవన్ కాదు ఎవరైనా సరే రాజకీయాల కోసం కొన్ని కొన్ని పర్సనల్ క్వాలిటీస్ వదులుకోవాల్సిందే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్ ఒక్క మెసేజ్ లేదా ఒక్క ట్వీట్ చేస్తే ఫాన్స్ కూల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు..!!