సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్ ఫ్యామిలీ పరసనల్ పిక్స్..ఇప్పుడు ఆ ఫోటోస్ బయటపెట్టడానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ ఎప్పుడైతే పోస్ట్ పెట్టాడో.. అప్పటినుంచి ఆయన పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . అయితే అదంతా పెళ్లి గురించి కాదు సినిమా ప్రమోషన్స్ గురించి అంటూ రీసెంట్ గా తేలిపోయింది . తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ వాళ్ళ నాన్నకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది . ప్రభాస్ నాన్నగారికి సంబంధించిన చాలా చాలా రేర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఈ ఫోటోలో ప్రభాస్ నాన్నగారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అచ్చం ప్రభాస్ కి వాళ్ళ నాన్నగారు ఫేస్ కట్స్ నే వచ్చాయి అంటూ పొగిడేస్తున్నారు. ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు ఒకప్పుడు నిర్మాత గారు రానించిన విషయం అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా సత్యనారాయణ రాజు ఫోటోలు సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి . ఎప్పుడు కూడా ప్రభాస్ వాళ్ళ నాన్నగారి ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మనం చూడలేదు.

ఫస్ట్ టైం ఈ విధంగా ట్రెండ్ అవుతూ ఉండడం అదే మూమెంట్లో ప్రభాస్ స్పెషల్ పర్సన్ రాబోతుంది అని పెట్టడం.. ఆ తర్వాత కల్కి సినిమాకు సంబంధించిన న్యూస్ రావడం సోషల్ మీడియాలో ఫాన్స్ కు అర్థం కాని గజిబిజిని క్రియేట్ చేస్తుంది . కొంపతీసి నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడా ..? అందుకే వాళ్ళ నాన్న ఫోటో ఈ విధంగా ట్రెండ్ అవుతుందా..? అని కొందరు అంటుంటే.. ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ మరికొందరు కొట్టి పడేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ నాన్నగారు ఫోటో వైరల్ గా మారింది..!!