మెగా ఫ్యామిలీతో గొడవ..అల్లు అర్జున్ అ సంచలన నిర్ణయం తీసుకున్నాడా..?

తెలిసి చేశాడో.. తెలియక చేసాడో తెలియదు కానీ అల్లు అర్జున్ తెలిసి తెలియక ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు .. మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఆ స్థాయిలో పైకి ఎదిగిన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయాడు అనే కామెంట్స్ దక్కించుకునేలా చేశాడు. అల్లు అర్జున్ రీసెంట్గా ఎలాంటి పొలిటికల్ ఇష్యూలో ఇరుక్కున్నాడో తెలిసిందే. వైసిపి క్యాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు.

జనసేన కోసం ఒక ట్వీట్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై పీకల్లోతు కోపంగా ఉన్నారు . అంతేకాదు నాగబాబు పెట్టిన ట్వీట్ అభిమానులను ఇంకా రెచ్చకొట్టింది . అంతేనా నాగబాబు ని కూడా సైకిళ్ళకు పంచర్లు వేసుకునే టైప్ అంటూ అల్లు రామలింగ గారు లేకపోతే అలాంటి స్థానమే నీది అని పరోక్షంగా చెప్పేశాడు బన్నీ. దీంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ పిక్స్ కి చేరుకుంది.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఇకపై మెగా ఫ్యామిలీతో ఇన్వాల్వ్ కాకూడదు అనుకుంటున్నారట. మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నారట . అంతేనా మెగా ఫ్యామిలీ గ్రూప్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయారట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ సంచలనంగా మారింది. అయితే ఈ వార్త ఎంత వరకు నిజమనేది బన్నీ లేదా మెగా ఫ్యామిలీ బయట పెడితే కానీ తెలియదు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!