పవిత్ర తో నరేష్ విడిపోతున్నాడా..? సంచలనం సృష్టిస్తున్న ట్వీట్..!

నరేష్ – పవిత్ర లోకేష్ వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో ట్రోలింగ్కి గురయ్యాయో మనం చూసాం. అయితే గత కొన్ని రోజులుగా ఈ పేర్లు చాలా సైలెంట్ గా అయిపోయాయి . కాగా తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన ట్వీట్ తో మరొకసారి వీళ్ళ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . అయితే ఆయన ఓ విషయం కారణంగా ట్విట్ చేస్తే సోషల్ మీడియాలో ఆకతాయిలు ట్రోలర్స్ ఆయనను మరొక విషయం కారణంగా ట్రోల్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నరేష్ పవిత్రల బంధం గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లేటు వయసులో పుట్టిన ఘాటు ప్రేమ అనే చెప్పాలి. అయితే తాజాగా నరేష్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు . “బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి ..ఈ ఎండవేడికి కార్ వ్యాన్ లోని ఏసీలు కూడా పనిచేయడం లేదు .. కొన్ని మూవీ యూనిట్లు షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాయి ..అంత వేడిగా ఉంది ..సో మిత్రులారా రాబోయేది కొద్ది రోజులు మరింత దారుణంగా ఉంటాయి.. కాబట్టి మీరు అవసరమైతేనే బయటకు వెళ్ళండి.. లేకపోతే ఇంట్లోనే ఉండండి ..మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి “అంటూ రాసుకోచ్చాడు .

అలాగే జీవితం పర్ఫెక్ట్ గా లేదు అయినప్పటికీ మీరు పర్ఫెక్ట్ మూమెంట్స్ తో నింపండి అంటూ ఓ ఫోటోని కూడా షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే కొంతమంది పవిత్రతో ఏమన్నా ప్రాబ్లమా..? అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు కొంతమంది రెచ్చిపోయి నువ్వు పవిత్రతో విడిపోతున్నావా ఏంటి..? అంటూ కూడా దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . సైలెంట్ గా ఉన్న నరేష్ ని కావాలనే గెలుకుతున్నారు కొందరు ఆకతాయిలు అంటూ నరేష్ ఫ్యాన్స్ కూడా రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు..!