స్టార్ హీరో సిగ్గు విడిచి..నోరు తెరిచి పెళ్లి చేసుకుందామా..? అని అడిగిన..రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఈమె..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు – పెళ్లిళ్లు – బ్రేకప్ లు- డివర్స్ లు.. చాలా చాలా కామన్. ఆ విషయం మనకు తెలుసు . అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు పెద్ద స్టార్ హీరో ప్రపోజ్ చేస్తే ఎవ్వరు కూడా అతని రిజెక్ట్ చేయరు అని ..అయితే అది తప్పు అంటూ ప్రూవ్ చేశారు ఒక స్టార్ హీరో . ఆయన ఓ హీరోయిన్ ని నోరు తెరిచి పెళ్లి చేసుకుందామా..? అంటూ ఓపెన్ గా అడిగారట . కానీ ఆమె నో చెప్పిందట . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ .

ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో..? ఇప్పటివరకు రీజనే బయటకు రాలేదు. కోట్ల ఆస్తి లగ్జరీయస్ లైఫ్ బతికే ఛాన్స్ కూడా ఉంది. ఆయన ఊ అంటే ఒకరు కాదు పదిమంది హీరోయిన్స్ అటే టైం పెళ్లి చేసుకుంటారు . అయినా సరే ఆయన ఎందుకో పెళ్ళికి దూరంగా ఉన్నాడు . అయితే లవ్ ఎఫైర్స్ మాత్రం చాలానే నడిపినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . కాగా సల్మాన్ ఖాన్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలీ మేనకోడలు నటి షర్మి సెగల్ మెహతాను ప్రేమించారట .

ఆమెను బాగా ఇష్టపడ్డారట . ఆమెను డైరెక్ట్ గా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అడిగారట. ప్రపోజ్ కూడా చేశాడట . కానీ ఆమె మాత్రం నిర్మొహమాటంగా నో అంటూ చెప్పేసిందట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది . దీంతో ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. హమ్ దిల్ దే చుకే సనం సెట్స్ లో ఆమెను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటావా..? అని అడిగారట . అయితే ఆమె సున్నితంగా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఏదో సరదాగా అడుగుతున్నాడు అంటూ నవ్వుతూ నో చెప్పిందట . అయితే నిజంగానే సల్మాన్ ఖాన్ జెన్యూన్ గా అడిగాడా ..?ఆటపట్టించడానికి అడిగాడా..? అన్నది మాత్రం ఆయనకే తెలియాలి . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!