చచ్చిన ఇండస్ట్రీలో ఆ పని చేయని హీరో-హీరోయిన్స్ వీళ్లే.. గ్రేట్ పర్సన్స్..!!

చాలామంది అనుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీ లోకి రాగానే పద్ధతి పాడు వదిలేస్తూ ఉంటారు అని .. మరీ ముఖ్యంగా స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఎక్కువగా అలవాటు చేసుకుంటూ ఉంటారు అని.. మరి కొంతమంది బ్యూటీస్ పూర్తిగా రెచ్చిపోతారు.. కొందరు డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు . దానికి సంబంధించిన విషయాలను మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం . అయితే ఇండస్ట్రీ మొత్తంలో ఉన్న హీరో హీరోయిన్లు అందరూ అలానే ఉండరు. కొంతమంది నీతిగా నిజాయితీగా పద్ధతిగా కూడా ఉంటారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

అభిషేక్ బచ్చన్ : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో 48 ఏళ్ళు ఉంటాయి. అయినా సరే మద్యపానం ధూమపానం అస్సలు అలవాటు లేదు . మొదటి నుంచి కూడా చాలా పద్ధతిగా కంట్రోల్ గా ఉంటూ వస్తున్నాడు .

పరిణితి చోప్రా: రీసెంట్ గానే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న పరిణితి చోప్రా కూడా అంతే.. మిగతా హీరోయిన్లు అందరూ స్మోకింగ్ డ్రింకింగ్ అంటూ పార్టీలు పబ్బులు అని ఎంజాయ్ చేస్తే .. ఆమె మాత్రం వాటికి దూరంగా ఉంటుంది . పార్టీకి వెళ్తుంది కానీ ధూమపానం మందు తీసుకోవడం లాంటివి చేయదు .

సోనూసూద్: ఇండస్ట్రీలో రియల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . కరోనా మూమెంట్లో ఈయన చేసిన సేవలు గురించి ఎంత చెప్పకున్నా తక్కువే ..సోను సూద్ కి కూడా మందు అలవాటే లేదు .అంతేకాదు స్మోకింగ్ కూడా చేయడు.

అమితాబచ్చన్: ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కాలమైంది ..అయితే ఇప్పటివరకు కూడా ఆయనకు స్మోకింగ్ అదేవిధంగా మందు తాగే అలవాటు లేనేలేదట.

దీపికా పదుకునె: గ్లోబల్ బ్యూటీ ఎంత హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తుందో తెలుసు. ఆశ్చర్యమేమిటంటే సినిమాలో నటించేటప్పుడు మాత్రమే అమ్మడు అలా మందు తాగినట్లు స్మోక్ చేస్తున్నట్లు నటిస్తుందట నిజ జీవితంలో ఆ వాసనంటే కూడా పడదట .

అక్షయ్ కుమార్ : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ..30 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉంటాడు . కానీ ఆయన వయసు 56 ఏళ్ళు. ఇతగాడికి మందు తాగడం స్మోకింగ్ చేయడం దురవ వ్యసనాల అలవాటులు ఏవీ లేవు..!!