హిమాలయాల్లో వికసించిన ఓ అందమైన పువ్వు.. టెన్షన్ లో పరిశోధకులు.. కారణమేంటంటే..?!

ఏదైనా అందమైన పువ్వులు వీకసించగానే చూడడానికి ఆనందంగా, ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్ హిమాలయాలు చుట్టుపక్కను పూసే ఓ పువ్వు వికసించగానే సైంటిస్టులకు ఆందోళన మొదలైంది. అదే రోరోడెండ్రాన్. ఈ అందమైన పువ్వు ఎరుపు, లేత గులాబీ రంగుల కలగలిపి వికసిస్తూ ఉంటుంది. చూడగానే కన్నులకు హాయిని ఇచ్చే ఈ పువ్వు హిమాలయ చుట్టుపక్కల్లో ఎర్రటి తివాచీ పరిచినట్లుగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఈ పూలు వేస‌విలో వికసిస్తూ ఉంటాయి. వీటిని చూడడానికి అక్కడ చుట్టుపక్కల వారు తరలి వెళ్తుంటారు.

ఈ పువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ పువ్వులు వికసించడంతో సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. దానికి కారణమేంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. సాధారణంగా ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ లో విసించే ఈ పువ్వులు.. ఈ ఏడాది డిసెంబర్, జనవరి నెలలోనే వచ్చేశాయి. దీంతో పరిశోధకులకు టెన్షన్ మొదలైంది. పూలు ఇంత త్వరగా వికసించడం గ్లోబల్ వార్మింగ్ అధికం అవ్వడానికి హెచ్చరిక అని.. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని టెన్షన్ లో ఉన్నారట సైంటిస్టులు.

కేవలం హిమాలయాల్లో మాత్రమే పూసే ఈ పూలు ఎక్కువగా వేసవిలో పూస్తాయి. 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. కానీ ఇది శీతాకాలంలో వికసించడం అనేది బలహీనమైన ప్రకృతిని సూచిస్తుందని.. మనిషి చేసే పనుల‌ వలన గ్లోబల్ వార్మింగ్ సమస్య పెరిగిపోయి పర్యావరణానికి డ్యామేజ్ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా గ్లోబల్ వార్మింగ్ అదుపులో ఉంచాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.