పరగడుపున ఈ ఆహారం తీసుకుంటే డేంజర్ లో పడినట్టే.. తప్పక తెలుసుకోండి..?!

ప్రస్తుత రోజులో ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్ గా ఉంటున్నారు. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ఆరోగ్యంగా ఉండాలని చాలామంది భావిస్తూ ఉంటారు. కారణం పరగడుపున మనం ఏ ఆహారం తిన్న ఆ టైంలో మనం తినే ఆహారం నేరగా మన జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతోందట. దీంతో ఉదయం అల్పాహారం రోజు మొత్తం చేసే పని పై ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ రోజంతా చేసే పనికి శక్తిని ఇవ్వడానికి కాకుండా.. ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. కనుక పోషకాహార ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాళీ కడుపుతో కొన్ని ఆహారాలను అసలు తినకూడదని.. వాటి వల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ పరగడుపున తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Your Morning Beverage: Let's Talk Milk, Juice, And Coffee | Absolute Dental Care

ఉదయం లేచిన వెంటనే చాలామందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. బద్ధకాన్ని వదిలించుకోవడానికి ఒక అప్పు స్ట్రాంగ్ టీ లేదా కాఫీతో తమ రోజున ప్రారంభించడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో టీ, కాఫీ లాంటివి తాగడం వల్ల కడుపులో ఆసిడ్స్ పరిణామం పెరిగి.. ఎసిడిటీ రిఫ్లెక్స్ కారణమవుతుంది. దీంతో గుండెలో మంట, పుల్లని తేన్పులు, కడుపులో నొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్‌, జామ్ లాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యకరమని అంత భావిస్తూ ఉంటారు. కానీ అల్పాహారంలో బెడ్, పేస్ట్రీలు లేదా తీపి పదార్థాలను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని.. దాని కారణంగా మధుమేహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Bread Butter Jam Toast / Sandwich Recipe | Chitra's Food Book

భోజనానికి ముందే నీరసం త‌లుగుతుంది. ఇక మన భారతీయుల చాలామంది ఉదయాన్నే పూరి, బజ్జి, బంగాళదుంప కుర్మా, క్యాలీఫ్లవర్ పరోటా, పకోడాలు లాంటివి ఎక్కువగా టిఫిన్స్ లో తీసుకుంటూ ఉంటారు. కానీ కొవ్వు పదార్థాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం అసలు మంచిది కాదని.. ఇది వికారం, కడుపులో గ్యాస్ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆయిల్ ఫుడ్ బదులుగా అల్పాహారంగా గంజి, వోట్స్, గుడ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలని చెప్తున్నారు. అలానే స్పైసి వంటకాలను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఉదయాన్నే అల్పాహారంగా కూడా ఫ్రైడ్ రైస్ లాంటి మసాలా ఫుడ్ ను తినాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

Top 15 Spiciest Indian Food To Bring Out the Fire In You

ఇది జీర్ణ వ్యవస్థకు హానికరం. కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడేవారు ఉదయాన్నే కాళీ కడుపుతో మసాలాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. కనుక తక్కువ నూనెతో, తేలికపాటి మసాలాలు వాడిన ఆహారాన్ని తినడం మంచిది. అల్పాహారం కోసం ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అంతా భావిస్తూ ఉంటారు. కానీ మరీ కాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్‌ తీసుకోవడం షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం అవుతుందని.. మధుమేహం వచ్చే సమస్య ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఫ్రూట్ జ్యూస్ కన్నా డైరెక్ట్ ఫ్రూట్స్ తినడం మంచిదట. ఎందుకంటే పండ్లను నేరుగా తినడం వల్ల ఫైబర్ ల‌భిస్తుంది. ఫ్రూట్ జ్యూస్లా చేసుకుని తాగడం వల్ల ఫైబర్ గుణాన్ని కోల్పోతుంది.. దీంతో అందులో ఉండే అధిక షుగర్స్ ఆరోగ్యానికి కీడు చేస్తాయి.