“కల్కి 2898AD” సినిమాలో కీర్తి సురేష్..ఇంట్రెస్టింగ్ ట్వీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్..!!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ప్రభాస్ కల్కి సినిమాలో కేవలం దిశాపటాన్ని – దీపికా పదుకొనేలు మాత్రమే హీరోయిన్లుగా నటించారు అంటూ అనుకున్నారు . కానీ ఈ సినిమాలో ఒక బిగ్ ట్వీస్ట్ ఇవ్వబోతున్నాడు నాగ్ అశ్వీన్ అంటూ తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారింది. మహానటితో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కీర్తి సురేష్ .. ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో భాగం కాబోతుందట.

ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న కీర్తి సురేష్ .. బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కిలో భాగం కాబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో బుజ్జి అనే వాహనం హైలైట్ గా మారబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఈ వాహనం సినిమాలో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుందట.

అయితే ఈ వాహనం డైలాగ్స్ కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గొంతుని అందించింది అంటూ తెలుస్తుంది . కీర్తి సురేష్ డైలాగ్స్ కు డబ్బింగ్ పూర్తి కూడా చేసేసారట . ఆమె వాయిస్ చాలా హైలెట్ గా మారిపోతుందట . నాగ్ అశ్వీన్ పై ఉన్న గౌరవంతోనే కీర్తి సురేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన #ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది..!!