“మీకు దండం పెడతా రా..దయ చేసి నన్ను వదిలేయండి”.. ఫ్యాన్స్ ని బ్రతిమిలాడుకుంటున్న స్టార్ హీరోయిన్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పటినుంచి రేణు దేశాయిని ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు టార్గెట్ చేస్తూనే ఉన్నారు . అంతేకాదు రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టిన సరే దానికి పవన్ కళ్యాణ్ ని లింక్ చేస్తూ ఫ్యాన్స్ ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి మాత్రం రేణు దేశాయ్ కొంచెం ఘాటుగానే స్పందించింది.

“దయచేసి నన్ను ఆయనతో కంపేర్ చేయకండి ..నా పోస్టులను ఆయనతో ముడి పెట్టకండి “అంటూ ఓపెన్ గా చెప్పేసింది . రేణు దేశాయికి కుక్కపిల్లలు అన్న జంతువులు అన్న చాలా చాలా ఇష్టం ..సర్వీస్ కూడా చేస్తుంది. అనిమల్స్ ఎన్జీవోలకు సహకారం కూడా అందిస్తుంది. తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ దానికి సంబంధించిన ఒక పోస్ట్ షేర్ చేసింది . పవన్ అభిమాని ఆ పోస్ట్ కి ” మా అన్నయ్య పవన్ కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్” అంటూ కామెంట్ చేశాడు.

దీనికి రేణు దేశాయ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది . “ఎందుకు ప్రతిసారి నా పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తూ ఉంటారు .. ఇప్పటికే ఇలాంటి వాళ్ళని చాలామందిని బ్లాక్ చేసేసాను.. డిలీట్ చేశాను నేను సింగిల్ గా ఉన్నాను ..అనిమల్ సర్వీస్ చేస్తున్నాను. నాకు 10ఏళ్లు ఉన్నప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఉంది .. నా ఎక్స్ హస్బెండ్ కి దీనికి సంబంధం లేదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి పోస్ట్ కి ఆయనతో కంపేర్ చేయకండి” అంటూ ఘాటుగా స్పందించింది . దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!