రష్మిక బీజేపీ కి సపోర్ట్ చేయడం వెనుక ఆ స్టార్ హీరో హస్తం ఉందా..? అడ్డంగా ఇరుక్కుపోయిందే..!!

టైం బాగోలేకపోతే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు .. బహుశా రష్మిక మందన్నా విషయంలో అదే జరుగుతుంది కాబోలు .. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో తోపైన హీరోయిన్గా నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేసిన ఈ బ్యూటీ .. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది . దానికి కారణం ఒకే ఒక్క వీడియో. రీసెంట్గా రష్మిక మందన్నా.. బిజెపి పార్టీకి పరోక్షకంగా సపోర్ట్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది . ఆ వీడియో ఎంత వైరల్ గా మారిందో మనకు తెలిసిందే.

ఆ వీడియో పై నరేంద్ర మోడీ కూడా ట్విట్ చేశాడు . ఆశ్చర్యం ఏంటంటే నరేంద్ర మోడీ మెసేజ్ కి రష్మిక తిరిగి రిప్లై ఇచ్చింది. దీనితో ఇదంతా పెద్ద గ్యాంబ్లింగ్ అంటూ రాజకీయ నేతలు మండిపడుతున్నారు . అయితే ఎప్పుడు కూడా సినిమాల పరంగా మాత్రమే పాపులారిటీ చెందుకుంటూ ఆ విషయాలను పట్టించుకునే రష్మిక మందన్నా.. సడన్గా ఇలా పొలిటికల్ టర్న్ తీసుకోవడం వెనక ఒక స్టార్ హీరో హస్తం ఉంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

ఆ స్టార్ హీరో బిజెపి పార్టీకి బాగా సపోర్ట్ చేస్తారట . ఆ స్టార్ హీరో రష్మిక కి జాన్ జిగిడి దోస్త్ ఆ కారణంగానే రష్మిక .. ఆ స్టార్ హీరో మాటలను కాదనలేక బిజెపికి సపోర్ట్ చేసిందట . బిజెపికి సపోర్ట్ చేస్తే పొలిటికల్ పరంగా తనకి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అని .. తెలిసినా కూడా ఆ హీరో కోసం బిగ్ రిస్క్ చేసింది రష్మిక అంటున్నారు . ఆమె ఊహించిన విధంగానే రష్మిక అనుకోని చిక్కుల్లో ఇరుక్కుపోయింది . ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మడుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఇలా బిజెపికి సపోర్ట్ చేసినందుకుగాను రష్మిక ఖాతాలో ఏకంగా 10 కోట్లు వచ్చి చేరాయట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!