ఎన్టీఆర్ పాలిట శనిలా దాపురిచారు కదా రా.. కోపంతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్..!?

మనందరికీ తెలిసిందే ..ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ ఒక పని పాట లేని బ్యాచ్ కావాలనే ఎన్ టీఆర్ ని ట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ కి అవసరంలేని మ్యాటర్స్లో కూడా ఎన్టీఆర్ పేరుని ప్రస్తావిస్తూ ఆయనను ట్రోల్ చేస్తూ ఉంటుంది . అలాంటి బ్యాచ్ కి ఎప్పటికప్పుడు నందమూరి ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తూనే ఉంటారు . అయితే త్వరలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ సినిమాలకి సంబంధించిన డీటెయిల్స్ రివీల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమా టైటిల్ లోగోను అఫీషియల్ గా ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట .

అయితే ఈ సినిమాకి డ్రాగన్ అంటూ ఓ పేరును కూడా ఫిక్స్ చేసుకున్నాడట ప్రశాంత్ – ఎన్టీఆర్ . సడన్గా ఆ పేరుతో మరో సినిమాని అనౌన్స్ చేశారు . దీంతో అభిమానులకి ఫుల్ కోపం వచ్చేసింది . అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. డ్రాగన్ పేరుతో రీసెంట్గా ఓ అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం అంటూ చెప్పారు . ఇది ఓ తమిళ సినిమాగా తెలుస్తుంది .

అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ది కూడా ఇదే టైటిల్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూమెంట్లో సడన్ గా పుట్టిన రోజుకి రెండు రోజులు ముందే ఇలా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అనుకున్న టైటిల్ తో వేరే ఒక సినిమా అనౌన్స్ చేయడం ఇప్పుడు అభిమానులకి కోపం తెప్పిస్తుంది . ఓ రేంజ్ లో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎందుకు రా ఎన్టీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు .. మీకు ఇక వేరే వాళ్లు దొరకలేదా..? అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు వైరల్ గా మారింది . అంతేకాదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎలాంటి టైటిల్ ని అనౌన్స్ చేస్తారు అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!