“అది కోత ఇది లేత..ఒక్క రోజు ఓపిక పట్టండి”.. దేవర నుండి ఊరించే న్యూస్ వచ్చేస్తుంది..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా.. ఈగర్ గా .. దేవర అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా ద్వారానే జాన్వి కపూర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది .

ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ . అయితే ఆ సాంగ్ రిలీజ్ చేయకముందు నుంచే ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ ఫాన్స్ ను ఉరించేస్తున్నారు దేవర టీం. రీసెంట్గా రామ జోగయ్య శాస్త్రి గారు ట్వీట్టర్ వేదికగా స్పందించారు . నందమూరి ఫ్యాన్స్ కి ఆశలు పెంచేశారు.

“ఒక్కరోజు ఒకే ఒక్క రోజు ఓపిక పట్టండి ..మన ‘అని’ అబ్బా వర్తు వెయిటింగ్ ‘అని’ పిస్తాడు.. మనందరి నోట రెండో పాట రికార్డింగ్ కి వచ్చా.. చెన్నైకి ఇదో కొత్త రకం ప్రకంపనం ..అనుకోండి అది కోత ఇది లేత ” అంటూ ట్విట్ చేశారు. ప్రెసెంట్ రామ జోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నందమూరి అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . ఈ పాట కచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది అంటున్నారు నందమూరి అభిమానులు . వెయిటింగ్ అంటూ రామ జోగయ్య శాస్త్రి కి రిప్లై ఇస్తున్నారు నందమూరి అభిమానులు..!!