‘కన్నప్ప ‘ పై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న మంచు విష్ణు.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ?!

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్లు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడంటూ మంచు విష్ణు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వైరల్ చేస్తూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా కన్న‌ప్ప‌కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

Kannappa: Kajal Aggarwal to play a vital role in this Vishnu Manchu starrer  | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

కన్నప్ప సినిమాలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నో సెలెక్ట్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఆమెను స్వాగతిస్తున్న పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే మంచు విష్ణు, కాజల్ కలిసి మోసగాళ్లు మూవీలో నటించారు. ఈ క్రమంలో మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప సినిమాలో కాజల్ కీలకపాత్ర వహిస్తుందని తెలియడంతో.. ఆమె పాత్ర ఏమిటి అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

Kajal Aggarwal: Get Latest News, Photos and Videos along with latest  updates on Kajal Aggarwal | Hindustan Times

కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్ లో అందమైన ప్రదేశాల్లో షూట్‌చేస్తున్న‌ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అలాగే మే 20 నా కేన్స్ లో జరిగే ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీజర్ ను మేకర్స్ లాంచ్ చేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు టీజర్ చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.