అమ్మ బాబోయ్..రానా అంత ఫుడ్ పిచ్చోడా..? ఆఖరికి అవి కూడా తింటాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి ఫుడి.. ఎంతలా అంటే ఫుడ్ ని కుమ్మేస్తారు . కొందరి హీరోలు ఫుడ్ ని చాలా లైట్ గా తీసుకుంటారు . అయితే అలాంటి లిస్టులోకి కొంతమంది పాన్ ఇండియా హీరోలు రారు . వాళ్ళల్లో ఒకరే మన రానా దగ్గుబాటి . రానా దగ్గుబాటి ఫుల్ గా ఫుడి తింటాడు . ఈ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు ఓపెన్ గా చెప్పుకొచ్చారు . మరి ముఖ్యంగా రానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

“నేను పెద్ద నాన్ వెజిటేరియన్ .. ఫుడ్ లేకపోతే అస్సలు ఉండలేను అని.. రానా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఆ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ..” నేను ఫుల్ ఫూడీని ..నాన్ వెజ్ అంటే కుమ్మి పడేస్తాను .. బాహుబలి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రకు మారడానికి మూడు నెలలు వెజిటేరియట్ చేయాల్సి వచ్చింది. ఆ మూడు నెలలు నాకు ఎంత కష్టంగా గడిచాయో ఆ దేవుడికే తెలుసు . షూటింగ్ అయిపోయాక వెంటనే నాంపల్లిలో ఆదాబ్ అనే రెస్టారెంట్ ఉంటుంది “..

“ఆ రెస్టారెంట్ ఓనర్ నా ఫ్రెండ్ .. వాడికి ఫోన్ చేసి హలీం పంపించు అనగానే పంపించేస్తాడు . అది నోట్లో పెట్టుకోగానే నా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేసాయి. నేను ఆల్మోస్ట్ ఆల్ నాన్ వెజ్ లో అన్ని కూడా తినేసాను.. తిన్నాను.. తింటూనే ఉంటాను.. విదేశాలకు వెళ్తే అక్కడ లోకల్ గా దొరికే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తింటాను.. నేనేం తిన్నానో చెప్తే మీరు భయపడి పోతారు ..పాములు కూడా తినేసాను “. దీంతో రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . అయ్యబాబోయ్ రానా ఇంత నాన్ వెజిటేరియనా..? అంటూ షాక్ అయిపోతున్నారు..!