ఎప్పుడైన ప్రభాస్ ఇల్లు చూశారా..? ఇంద్ర భవనంలా ఉంది..ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే..?

ప్రభాస్ .. టాలీవుడ్ స్టార్ హీరో .. రెబల్ హీరో ఆరడుగుల అందగాడు ..పాన్ ఇండియా హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు . టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఒకటా..? రెండా..? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ట్యాగ్స్ ఉన్నాయి.. అన్ని మన ప్రభాస్ కి ఇవ్వాలి. అభిమానులు ముద్దుగా డార్లింగ్ డార్లింగ్ అంటూ పిలుచుకునే ప్రభాస్ మరికొద్ది రోజుల్లోనే కల్కి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు . ఈ క్రమంలోనే తాజాగా తన నివాసంలో కొంతమంది ఫ్యాన్స్ ను ప్రభాస్ కలిశారు .

దీంతో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి . స్వయాన ఆ ఫ్యాన్స్ ప్రభాస్ ఇంటికి వెళ్లి కలవడం ..ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారడంతో ప్రభాస్ ఇల్లును చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు . ప్రభాస్ ఎన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతుడో తెలిసిందే. ఒక్కొక సినిమాకి వంద నుంచి 130 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటూ మోస్ట్ పాపులర్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . అయితే ఇంట్లో ప్రభాస్ ఎంత సింపుల్ లుక్స్ లో ఉంటాడు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది .

కోట్లు సంపాదించే హీరో ఇంట్లో ఈ విధంగా ఉంటాడా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ప్రభాస్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ని కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇదే మూమెంట్లో ప్రభాస్ ఇల్లు ఓ ఇంద్ర భవనంలా..? ఉంది అని చాలా చాలా పద్ధతిగా వాస్తు ప్రకారం కట్టుకున్నారు అని.. ఇల్లు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అని .. ఆ ఇల్లును చూస్తుంటే కోట్లు ఖర్చు చేసి కట్టినట్లుగా ఉంది అంటూ జనాలు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ప్రభాస్ ఫాన్స్ తో దిగిన పిక్స్ తాలూకా ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..!