పవన్ కళ్యాణ్ నోరు తెరిచి అడిగిన ఆ పని చేయని స్టార్ హీరోయిన్ ఈమె.. అంత హెడ్ వెయిటా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని జనాలు కొన్ని కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. బహుశా ఈ విషయంలో కూడా జనాలు అదేవిధంగా తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ .. తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు .. చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా
అయ్యాయి .

అయితే ఫ్లాప్ టాక్ దక్కించుకున్న కూడా కొన్ని సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి . ఆ లిస్టులోకే వస్తుంది “బంగారం”. హీరోయిన్ లేకుండా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా . ఈ సినిమా మొత్తం సెంటిమెంట్ బేస్డ్ ఆధారంగా తెరకేక్కింది . అయితే ఈ సినిమాలో చివరన ఒకే ఒక్క సీన్ కోసం మాత్రమే హీరోయిన్ పెట్టుకున్నారు డైరెక్టర్ . ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష .

అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుష్క ని అనుకున్నారట. అప్పటివరకు పవన్ కళ్యాణ్ – అనుష్క కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే అనుష్కను ఆ సినిమా కోసం అప్రోచ్ అవ్వగా ఆమె సున్నితంగా ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఒక్క సీన్ కోసం సినిమాలో నటించాలా..? నో అంటూ పవన్ కళ్యాణ్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరోక్షకంగా అనుష్క ని ట్రోల్ కూడా చేశారు..!!