బిగ్ షాకింగ్: కొంప ముంచేసిన రామ్ చరణ్ రాంగ్ డెసీషన్.. అభిమానులకి వెరీ వెరీ శాడ్ న్యూస్..!

ఇది నిజంగా రాంచరణ్ అభిమానులకి డిసప్పాయింట్మెంట్ న్యూస్ అని చెప్పాలి . త్వరలోనే తెరకెక్కబోతుంది అంటూ ఎంతో ఆశపడిన సినిమా షూట్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఒకటి రెండు నెలలు కాదు ఏకంగా మూడు నెలల పాటు రామ్ చరణ్ తన సినిమా షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేయించుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో రామ్ చరణ్ .

రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ని కంప్లీట్ చేశాడు. అంతేకాదు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి బాగా ట్రై చేస్తున్నాడు . పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి . అయితే నిజానికి ఈపాటికి ఈ సినిమా సెట్స్ పైకి రావాలి . కానీ కొన్ని కారణాల చేత ఆలస్యమైంది . అయితే పెరిగిపోతున్న ఎండకు బయట షెడ్యూల్స్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసేసాడట రామ్ చరణ్.

ఈ క్రమంలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఏకంగా మూడు నెలల పాటు వాయిదా వేసుకున్నారట . దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఇది డిసప్పాయింట్మెంట్గా మారిపోయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది అన్న ఆశలలో ఉన్నారు అభిమానులు . ఈ విషయం తెలుసుకొని డీలా పడిపోతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..!!