అలాంటి పని చేయమన్న స్టార్ హీరో.. గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన సంయుక్త మీనన్..!?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా రూట్ మార్చేస్తున్నారు . ఎలా అంటే ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అయితే చాలు కధ,, కంటెంట్ చూడకుండా నటించేసేవాళ్ళు . అయితే రాను రాను ట్రెండ్ మారిపోతుంది . జనాలు కూడా బాగా రియలైజ్ అవుతున్నారు. మరి ముఖ్యంగా హీరోయిన్స్ ఏ సినిమాలో నటిస్తే మన కెరియర్ ముందుకు వెళుతుంది..? అనే విషయాలను బాగా సీరియస్ గా తీసుకుంటున్నారు .

మరి ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ చాలా పకడ్బందీగా కెరీర్ని ప్లాన్ చేసుకుంటున్నారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. పేరుకు మలయాళీ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతలా అంటే స్టార్ హీరోలు కూడా సంయుక్త మా సినిమాలో నటించాలి అంటూ మొండి పట్టుదల పట్టేంతగా ఆమె పేరుని బాగా ట్రెండ్ అయ్యేలా చేస్తుంది.

రీసెంట్ గా సంయుక్త మీనన్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సంయుక్త మీనన్ కి ఒక స్టార్ హీరో బంపర్ ఆఫర్ ఇచ్చారట . ఆయన సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తాను అంటూ ప్రామిస్ చేశారట. అయితే సంయుక్త తన సినిమాకి తీసుకునేది కోటి రెండు కోట్లు అంతే.. ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ కి డబల్ స్థాయికి మించి రెమ్యూనరేషన్ ఇవ్వడం అవుతుంది . అయితే సంయుక్త మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట . 10 కోట్లు ఇచ్చినా కూడా చేయనే చేయను ఇష్టం లేకుండా ఐటెం సాంగ్ అస్సలు చేయను అంటూ తెగేసి చెప్పేసిందట . దీంతో సంయుక్త ఆన్సర్ పట్ల ఫ్యాన్స్ ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో నీలాంటి హీరోయిన్స్ ఇంపార్టెంట్ అంటూ పోగిడేస్తున్నారు..!