విశాఖ ఎంపీ: బొత్స ఝాన్సీ మూడోసారి పార్ల‌మెంటు ఎంట్రీ.. ప‌క్కాగా రాసిపెట్టుకోండి..?

విశాఖ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్నీ స‌ర్వేలు ఆమె విజ‌య‌పుబాట‌లోనే ఉన్నాయంటున్నారు. అటు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న బాల‌య్య చిన్న‌ల్లుడు మెతుకుమిల్లి శ్రీభ‌ర‌త్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. ఈ సారి అయినా గ‌త వైఫ‌ల్యాలను స‌రిచేసుకుని గెలుస్తాడ‌నుకున్న భ‌ర‌త్ త‌న‌దే గెలుపు అన్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఓట‌మి అంచుల్లోకి వెళ్లిపోయాడనే చ‌ర్చ బాగా న‌డుస్తోంది.

అటు రాజ‌కీయంగా చాలా సీనియ‌ర్ అయిన ఝాన్సీ ముందు భ‌ర‌త్ గిలగిల్లాడుతోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఏ విష‌యంలోనూ భ‌ర‌త్ ఝాన్సీకి పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు. బొత్స ఝాన్సీ ప్ర‌సంగాల ముందు భ‌ర‌త్ పూర్తిగా తేలిపోతున్నారు. ఝాన్సీ త‌న ప్ర‌సంగాల్లో త‌న‌ను పార్ల‌మెంటుకు పంపితే ఏం చేస్తానో ? ఏయే అంశాల గురించి అక్క‌డ పోరాటం చేస్తానో ? విశాఖ అభివృద్ధి విష‌యంలో ఏ విజ‌న్‌తో ఉన్నానో క్లీయ‌ర్‌గా చెపుతున్నారు. అస‌లు భ‌ర‌త్ ప్ర‌సంగాలు జ‌నాల‌కు అర్థంకాక గంద‌ర‌గోళ‌మే నెల‌కొంది.

ఎంపీగా ఝాన్సీ విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి ఎంపీగా ఉన్న‌ప్పుడు చేసిన అభివృద్ధి గురించి సూటిగా చెపుతున్నారు. అంత‌కుముందు విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న‌ప్పుడు రూర‌ల్ ప్రాంతాల్లో చాలా కేర్ తీసుకుని చేసిన అభివృద్ధి ఆమెకు ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. అస‌లు భ‌ర‌త్‌కు పేరుకు విద్యాసంస్థ‌ల చైర్మ‌న్‌గా ఉన్న చేసిన సేవ‌లు ఒక్క‌టీ చెప్పుకునేందుకు లేకుండా పోయాయి. ఆమె విజ‌య‌న‌గ‌రం ఎంపీగా ఉన్న‌ప్పుడే ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నో రైల్వే గేట్ల దగ్గర నుంచి విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్ సమస్యలు, విశాఖ పోర్టు సమస్యలు ఎన్నో పరిష్కారమయ్యాయి.

ఇక విశాఖ ఆడ‌ప‌డుచుగా ఆమె మీద జ‌నాల్లో సెంటిమెంట్ ఉంది. ఆమె ఎంపీ అయితే ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీలు, పొలిటిక‌ల్ గొడ‌వ‌లు ఉండ‌వ‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. పార్ల‌మెంటులో ఆమె చేసిన ప్ర‌సంగాల్లో దేశంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌తో పాటు మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. అంతేకాదు చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కూడా ముందుగా ఆమే ప్ర‌స్తావించారు.

ఇక కీల‌క‌మైన విశాఖ న‌గ‌రాన్ని గ్లోబ‌ల్ స్థాయిలో తీర్చిదిద్దాల‌నే ఆరాటంతో ఆమె విజ‌య‌న‌గ‌రం ఎంపీగా ఉన్న‌ప్పుడే ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌ను పార్లమెంటులో ప్ర‌స్తావించారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్టు స‌మ‌స్య‌ల‌ను ఝాన్సీ పార్ల‌మెంటులో ప్రస్తావించారు. ఇక పార్ల‌మెంటు ప‌రిధిలో ఏకంగా 2.5 ల‌క్ష‌ల ఓట్లు ఉన్న కాపు, తూర్పు కాపు ఓట‌ర్లు అంద‌రూ మెజార్టీ ఝాన్సీకే ఓట్లేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నారు. చాలా యేళ్ల త‌ర్వాత విశాఖ పార్ల‌మెంటు సీటు కాపుల‌కు ఇవ్వ‌డం.. అందులోనూ మ‌హిళ‌కు ఇవ్వ‌డంతో ఈక్వేష‌న్లు బ‌లంగా మారుతున్నాయి.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌భావం ఈ ఎన్నిక‌ల్లో చాలా గ‌ట్టిగా ప‌డ‌నుంది. జ‌గ‌న్ గెలుపులో అవే కీల‌కం కానున్నాయి. విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలో ఎంతోమంది పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి క‌లుగుతోంది. ఇక అటు గీతం వ‌ర్సిటీ శ్రీ భ‌ర‌త్ సొంత పార్టీ నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోలేక ఒంట‌రి పోరు స‌ల్పుతూ.. ఇటు గీతం వ‌ర్సిటీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేక చేతులు ఎత్తేస్తోన్న ప‌రిస్థితే ఉంది. టీడీపీ వాళ్లు కూడా భ‌ర‌త్‌కు ఎంపీ సీటు ఇచ్చి త‌ప్పు చేశాడ‌నే చెప్పుకుంటున్నారు. ఈ ప‌రిణామాలు అన్నీ ఈ సారి ఝాన్సీకి బాగా క‌లిసొచ్చి ఆమె మూడోసారి పార్ల‌మెంటు వైపు అడుగులు వేసేలా చేస్తున్న‌ట్టుగానే విశాఖ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.