” అవన్నీ ఫేక్ ” అలాంటి పోస్ట్ చేయడం ఆపేయండి.. ఫైర్ అవుతున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు మ‌యోసైటీస్ నుంచి కోలుకుంటున్నా సంగతి తెలిసిందే. ఇటీవ‌ల‌ సినిమాల నుంచి దాదాపు ఏడాది బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. మయోసైటిస్‌కు వివిధ రకాల చికిత్సలను తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం గ్రీస్ లోని అథెన్స్ వెకేషన్కు వెళ్ళిన ఆమె ఈ నేపథ్యంలో తాను నియర్ ఇన్ఫ్రారేట్‌సున అనే చికిత్స తీసుకున్నానని.. దాని ప్రయోజనాలను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసుకుంది. అయితే దీనితో పాటే సమంత దుస్తులు లేకుండా ఉన్న మరో ఫోటోను స్టోరీగా షేర్ చేసిందని.. కొంతసేపటికి దానిని డిలీట్ చేసిందంటూ ఓ ఫోటో షేర్ చేస్తూ నెటింట‌ తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోలో సమంత సెమీ న్యూడ్ గా కనిపించినట్లుగా ఉంది. దీంతో సమంత పై నెటిజ‌న్స్‌ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో ఆ ఫోటో ఫేక్ అని.. సమంత ఫోటోలు పోస్ట్ చేసి షేర్ చేశారంటూ అబద్ధపు మాటలతో ఫేక్ ఫోటోలను షేర్ చేసి వైరల్ చేస్తున్నారని.. సమంత ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆ బాత్ టబ్‌ ఫోటో ఫేక్ అని.. అరుదైన వ్యాధితో ధైర్యంగా పోరాడుతున్న సమంత కేవలం ట్రీట్మెంట్లో కలిగే ప్రయోజనాల కోసమే మొదటి ఫోటోను షేర్ చేసిందని.. ఆరోగ్యం పై అందరికీ అవగాహన కల్పిస్తున్న సమంత పై ఇలాంటి చెడు ప్రచారం సరైన విధానం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

భయంకరమైన మయోసైటీస్ నుంచి శరీరాన్ని మెరుగుపరుచుకునేందుకు సమంత ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి క్రమంలో చీప్ ఫోటో ఆమెదే అంటూ పోస్ట్ చేసిన ఆ ఫోటోకు ఇన్‌స్టాగ్రామ్ ఐడి కానీ, ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో అది పూర్తిగా ఫేక్.. ఇప్పటికైనా దానిని వెంటనే డిలీట్ చేయండి అంటూ సమంత ఫ్యాన్స్ ట్విట్ చేస్తున్నారు.