ఏకంగా ఆరు అంత‌ర్జాతియ అవార్డ్‌లు అందుకున్న ‘ హాయ్ నాన్న‌ ‘.. ఏ ఏ క్యాటగిరిల్లో అంటే..?!

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయ్ నాన్న ఫీల్ గుడ్ మూవీగా తెర‌కెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు మంచి సినిమాగా ఎన్నో ప్రశంసలు దక్కాయి. డిసెంబర్ థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు శౌర్యవ్‌కు భారీ పాపులారిటీ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు అంతర్జాతీయ వేదికపై పలు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తాజాగా అంతర్జాతీయ వేదికపై ఏకంగా ఆరు అవార్డులను అందుకుని రికార్డ్ సృష్టించింది.

ఈ విషయాన్ని మూవీ టీం తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇంటర్నెట్ ఫిలిం ఫెస్టివల్ 2024 అవార్డులో వేడుకలో హాయ్ నాన్న సినిమా ఇంటర్నేషనల్ వేదికపై మొత్తం ఆరు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. అత్యుత్తమ యాక్టింగ్ జోడిగా నాని, మృణాల్‌ ఠాకూర్ కు కలిపి వాళ్ళు అవార్డు అందింది. అలాగే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫస్ట్ టైం డైరెక్టర్ అవార్డులు దక్కించుకున్నాడు. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ స్టోర్ విభాగాల్లో మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ కు అవార్డులు సొంతమయ్యాయి.

Mrunal Thakur and Nani start shooting on their highly anticipated untitled  Telugu movie.

ఇక ఈ విషయాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ వేదికగా మేకర్స్ స్వయంగా అనౌన్స్ చేశారు. స్పీడీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో హాయ్ నాన్న‌కు ఆరు అవార్డులు దక్కయని.. ప్రేమకు అసలైన ప్రతిధ్వని ఇలానే ఉంటుంది.. ఇప్పటికీ హాయ్ నాన్నకు 18 ఇంటర్నేషనల్ అవార్డు వ‌చ్చాయంటూ ట్విట్ చేశారు మేకర్స్. ఇలా ఈ స్పీడ్ ఫెస్టివల్ లో ఒకేసారి హాయ్ నాన్న సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు సొంతమవడంతో నాని ఫ్యాన్స్‌కు ఆనంద నీ వ్యక్తం చేస్తున్నారు.